తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి.ఒక పక్క ప్రభుత్వ పరంగా.
ప్రక్షాళన కార్యక్రమాలు చేపడుతూనే మరోపక్క.హామీలు నెరవేరుస్తున్నారు.
గత ప్రభుత్వం వ్యవహరించిన మాదిరిగా కాకుండా ప్రజలను కట్టడి చేసే విధంగా కాకుండా.నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రగతి భవన్ లోకి ప్రజలు మరియు మీడియా ప్రతినిధులు వచ్చే విధంగా దాన్ని పేరు ప్రజా భవన్ గా మార్చడం తెలిసిందే.ఇదిలా ఉంటే తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించినట్లు సీపీ తెలియజేయడం జరిగింది.
వాహనాదారులకు ఇబ్బంది కలగకుండా తన కాన్వాయ్ వెళ్లే విధంగా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారట.సాధారణ ట్రాఫిక్ లోకి తన కాన్వాయ్ అనుమతించాలని సూచించడం జరిగిందట.హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు ఎక్కువ అని అందరికీ తెలుసు.దీంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లే సమయంలో వాహనాదారులను ఆపేస్తూ ఉంటారు.అయితే సీఎం కాన్వాయ్ వెళ్లాక ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చాలా సమయం పడుతుంది.దీంతో చాలామంది వాహనాదారులు అసహనం చెందుతుంటారు.
అయితే ఆ పరిస్థితి రాకుండా సీఎం రేవంత్ రెడ్డి.ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా వాహనాదారులు ఇబ్బంది పడకుండా… ఉండేలా తాజాగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.