ఠాగూర్ సినిమా వల్ల డాక్టర్ల బ్రతుకులు నాశనం.. ప్రముఖ డాక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

చిరంజీవి సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఠాగూర్ సినిమా( Tagore ) ఒకటి.

ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా మెగా అభిమానులకు సైతం ఎంతో ఇష్టమైన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

వినాయక్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా రమణ అనే తమిళ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కడం జరిగింది.అయితే ఠాగూర్ సినిమా వల్ల డాక్టర్ల బ్రతుకులు నాశనం అని ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి( Gurava Reddy ) అన్నారు.

Doctor Guruvareddy Comments About Tagore Movie Details Inside Goes Viral In Soci

తాజాగా ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఠాగూర్ సినిమాలోని సీన్ ఎవరు రాశారో తెలీదు కానీ వైద్య వృత్తికి తీరని నష్టం చేకూర్చారని చెప్పుకొచ్చారు.ఒక విధంగా ఆ సన్నివేశం వరస్ట్ సీన్ అని గురువారెడ్డి తెలిపారు.ఆ సీన్ చూసిన తర్వాత చాలామంది డబ్బుల కోసమే రోగులను ఐసీయూలోకి తీసుకెళ్తారని భావిస్తున్నారని కామెంట్లు చేశారు.

ఏదైనా కారణం వల్ల రోగి చనిపోతే రోగి చనిపోవడానికి కారణం మేము కాదని వైద్యులు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

Doctor Guruvareddy Comments About Tagore Movie Details Inside Goes Viral In Soci
Advertisement
Doctor Guruvareddy Comments About Tagore Movie Details Inside Goes Viral In Soci

చిరంజీవి నాకు క్లోజ్ ఫ్రెండ్ అని చిరంజీవి( Chiranjeevi )తో కలిసి చాలాసార్లు భోజనం చేశానని ఆయన పేర్కొన్నారు.ఒక సందర్భంలో చిరంజీవితో ఠాగూర్ సినిమాలోని సన్నివేశం గురించి చర్చించానని గురువారెడ్డి వెల్లడించారు.ఆ సన్నివేశం వైద్యులకు మనశ్శాంతి లేకుండా చేసిందని చెప్పానని ఆయన పేర్కొన్నారు.

అయితే ఆ సీన్ ఇంకా దారుణంగా ఉందని తానే కొంత మార్చానని చిరంజీవి చెప్పారని ఆయన పేర్కొన్నారు.గురువారెడ్డి చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

భవిష్యత్తులో చిరంజీవి ఏదైనా ఇంటర్వ్యూలో ఈ కామెంట్ల గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు