రావణాసురుడి కుటుంబ సభ్యులు ఎవరో మీకు తెలుసా?

రామాయణ మహా కావ్యంలో సీతను ఎత్తుకెళ్లి విలన్ గా నిలిచిన రావణాసురుడి గురించి అందరికీ తెలిసన విషయమే.

కానీ ఆయన తల్లి తండ్రులు, సోదరులు, భార్య, ఆయనకు ఎంత మంది పిల్లలు అనే విషయం మాత్రం చాలా మందికి తెలీదు.

ఇప్పుడు వారందరి గురించి మనం తెలుసుకుందాం.రావణాసురుడి తండ్రి విశ్వవసు బ్రహ్మ.

ఆయన తల్లి కైకసి.వీరిద్దరూ అసుర సంధ్యా సమయంలో సంబోగించడం వల్ల రావణాసురుడు రాక్షసుడిగా పుట్టాడు.

రావణాసురుడుకి మొత్తం ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.వారెవరు, వారి పేర్లోంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement
Do You Know Who Is Ravanasura Family Members Details, Ravanasura, Ravanasura Fam

కుబేరుడు, విభీషణుడు, కుంబ కర్ణుడు, ఖరుడు, దూషణుడు, అహిరావణుడు అనే ఆరుగురు సోదరులు ఉన్నారు.అలాగే కుంభిని, శూర్పణఖ అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు.

కుంభిని గురించి ఎవరికీ తెలియకపోయినప్పటికీ… శూర్పణఖ గురించి మాత్రం చాలా మందికి తెలిసే ఉంటుంది.అసలు రావణాసురుడు సీతను ఎత్తుకుపోవడానికి కారణమే ఈమె.శూర్పణఖ రావణాసురుడిని రాముడిపై ఉసిగొల్పడం వల్లే ఈ కథంతా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

Do You Know Who Is Ravanasura Family Members Details, Ravanasura, Ravanasura Fam

పది తలలు ఉన్న రావణాసురుడి భార్య పేరు మండోదరి.ఈమె మహా పతివ్రత.అంతే కాదండోయ్ యమ ధర్మరాజు కూతురు కూడా.

రావణాసురుడికి మొత్తం ఏడుగురు కుమారులు ఉన్నారు.వారిలో మొదటి వాడు ఇంద్రజిత్తు, రెండో వాడు ప్రహస్థుడు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

మూడో వాడు అతికాయుడు.నాలుగో వాడు అక్షయ కుమారుడు.

Advertisement

ఐదో వాడు దేవాంతకుడు.ఆరో వాడు నరాంతకుడు.

ఏడో వాడు త్రిసురుడు.

తాజా వార్తలు