ఆరు నెలల పిల్లలకు అన్న ప్రసన్న రోజున మొదటి ముద్ద ఎవరు తినిపిస్తారో తెలుసా..

మన భారత సంస్కృతిలో ఆచార సంప్రదాయాలకు ఎంతో విశిష్టత ఉంది.

సాధారణంగా పిల్లలు పుట్టిన దగ్గరనుంచి వారి పెండ్లి జరిగే వరకు ఎన్నో కార్యక్రమాలను మన దేశ ప్రజలు చేస్తూ ఉంటారు.

అదే విధంగా పిల్లలు పుట్టిన తర్వాత ఆరు నెలలకు చేసే మొదటి శుభకార్యం అన్న ప్రసన్న.ఈ అన్న ప్రసన్న కార్యక్రమం చేసే విధానంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని వేద పండితులు చెప్తున్నారు.

కొంతమంది ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.కానీ ఈ కార్యక్రమంలో నిర్వహించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

పిల్లలకు 5 నెలలు పూర్తయి ఆరో నెలలో పడిన తర్వాత ఐదవ రోజున అన్న ప్రసన్న చేయాలని పండితులు చెబుతున్నారు.అలాగే అన్న ప్రసన్న కార్యక్రమాన్ని ఎక్కడంటే అక్కడ కాకుండా చిన్నారి మేనమామ గృహంలో చేయాలి.

Advertisement

అన్న ప్రసన్న చేయడానికి ఆవు పాలు లేదా పెరుగు, నెయ్యి, తేనె అన్నంతో పరమన్నాన్ని వండి సిద్ధం చేసుకోవడం మంచిది.ఈ పరమన్నాన్ని ముందుగా దైవానికి నైవేద్యంగా సమర్పించాలి.ఆ తర్వాత దీనిని పిల్లలకు తినిపించడం మంచిది.

ఇలా వండిన పరమాన్నాన్ని వెండి పళ్లెంలో తీసుకొని బంగారు ఉంగరం లేదా చెంచాతో పిల్లలకు మూడుసార్లు ముందుగా తినిపించాలి.ఆ తర్వాత చేత్తో తినిపించాలి.ఆ పరమాన్నాన్ని ముందుగా బాబు తండ్రి తినిపించాలి.

ఆ తర్వాత తల్లి తరుపు వారైనా మేనమామ, అమ్మమ్మ, తాతయ్య గారు తినిపించాలి.అయితే ఇలా అన్న ప్రసన్న కార్యక్రమం చేయడం వల్ల ఆ పిల్లాడికి గర్భంలో ఉండగా వచ్చే దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.ఈ విధంగా పిల్లలకు అన్న ప్రసన్న వెనుక కూడా ఎన్నో నియమాలు ఉన్నాయని ఈ శుభకార్యాన్ని ఎక్కడంటే అక్కడ చేయకూడదని వేద పండితులు చెబుతున్నారు.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు