విక్రమార్కుడు సినిమాలో నటించిన చిన్నారి గుర్తుందా.. లేటెస్ట్ ఫోటోస్ చూస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు రవితేజ( Ravi Teja ).

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈయన అనంతరం సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.

ఇలా తన నటనకు మంచి మార్కులు పడటంతో ఈయనకు సినిమాలో హీరోగా అవకాశాలు కూడా వచ్చాయి.ఇలా వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

ఇక రవితేజ సినీ కెరియర్లో బ్లాక్ బస్టర్ సినిమాలలో విక్రమార్కుడు( Vikramarkudu ) సినిమా ఒకటి అని చెప్పాలి.రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

అత్తిలి సత్తి అంటూ కామెడీ పాత్రలో నటించే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.అలాగే విక్రమ్ రాథోడ్ గా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో తన నటనతో అదరగొట్టారు.

Do You Know Vikramarkudu Movie Child Artist Neha Is Doing Now Details, Vikramark
Advertisement
Do You Know Vikramarkudu Movie Child Artist Neha Is Doing Now Details, Vikramark

ఇక ఈ సినిమాలో రవితేజకి జోడిగా అనుష్క( Anushka ) నటించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో రవితేజను నాన్న అంటూ ఎంతో అమాయకంగా పిలుస్తూ తన చుట్టూ తిరుగుతూ ఉండే చిన్నారి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న విషయం మనకు తెలిసిందే.రవితేజ ఈ చిన్నారి మధ్య వచ్చే సన్నివేశాలు చూసిన ప్రేక్షకులు కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు.

ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ చిన్నారి పేరు నేహా( Neha ) అయితే ఈమె ఈ సినిమా ద్వారా సక్సెస్ అందుకొని తదుపరి ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి నేర్పించారు.

Do You Know Vikramarkudu Movie Child Artist Neha Is Doing Now Details, Vikramark

నేహా చైల్డ్ ఆర్టిస్ట్ గా అనసూయ, రాముడు, ఆది విష్ణు, రక్ష, సర్కార్ చిత్రాల్లో కూడా కనిపించింది.ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది.ఉన్నత చదువుల కోసం ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనే విషయాలను తెలుసుకోవడం కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఈమె కోసం వెతకడం మొదలుపెట్టారు అయితే ఈ ఫోటోలు చాలా తక్కువ సంఖ్యలో సోషల్ మీడియాలో ఉన్నాయని చెప్పాలి.

అయితే ఈమె ఫోటోలు చూసిన అభిమానులు ఒకసారిగా షాక్ అవుతున్నారు.హీరోయిన్ గా ట్రై చేస్తే కచ్చితంగా నేహా సక్సెస్ అవుతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వెంకీ అట్లూరి బాటలోనే నడుస్తున్న అజయ్ భూపతి...
Advertisement

తాజా వార్తలు