చన్నీటి స్నానం చేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!?

బయట పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంచక్కా వేడి నీళ్లు పెట్టుకుని స్నానం చేస్తే హాయిగా ఉంటుంది కదా అని అనుకుంటారు.

అలాగే చాలా మంది చన్నీటితో స్నానం చేయడానికి అంతగా ఇష్టపడరు.

ఎక్కువ మంది వేడి నీటి స్నానానికే ఇష్టపడతారు.కానీ.

, చల్లని నీటితో స్నానం చేయడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చేసిన కొన్ని రకాల ప్రయోగాల ద్వారా తెలుస్తోంది.గత కొన్ని ఏళ్ళ నుంచి శాస్త్రవేత్తలు చన్నీటి స్నానం పై చేసిన ప్రయోగాల వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు.

మరి చన్నీటి స్నానం వలన కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దామా.చన్నీటితో స్నానం చేయడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత వస్తుంది.

Advertisement
Do You Know The Health Benefits Of Taking A Lukewarm Bath, Cool Water, Bathing,

అలాగే మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది.అలాగే గుండెలోని రక్తనాళాల వద్ద అధికంగా పెరిగిపోయిన కొవ్వు పేరుకుపోకుండా చన్నీటి స్నానం ఉపసమానం కలిగిస్తుంది.

మాములుగా మనం అందరం శీతాకాలంలో చల్లగా ఉంటుంది కావున చన్నీటి స్నానం చేయడానికి ఒణికి పోతారు.

Do You Know The Health Benefits Of Taking A Lukewarm Bath, Cool Water, Bathing,

కానీ చలిగా ఉన్న సమయంలో సముద్రంలో కానీ, నదిలో గాని, స్విమ్మింగ్ పూల్, స్నానం చేసే షవర్ కింద నిలబడి తడిచినప్పుడు మన శరీరంలో ఉన్న మానసిక ఒత్తిడి ఇట్టే దూరం అవుతుందని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తెలిసింది.ప్రతిరోజు చన్నీటి స్నానం చేయడం, స్విమ్మింగ్ చేయడం వంటివి చేసే వారిలో శ్వాసకోస వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.చూసారు కదా చన్నీటి స్నానం చేయడం వలన ఎన్ని ఉపయోగాలో.

మరి ఇకమీదట అయిన వేడి నీటి స్నానాన్ని తగ్గించి మెల్లగా చన్నీటి స్నానాన్ని అలవాటు చేసుకోండి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు