కాక‌ర‌కాయ ర‌సం జుట్టుకు రాస్తే ఎన్ని లాభాలో తెలుసా?

కాకరకాయ.( Bitter Gourd ) ఈ పేరు వెంటనే చాలా మంది ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తుంటారు.

కారణం దాని రుచి.కాకరకాయ చేదుగా ఉండడం వల్ల ఎక్కువ శాతం మంది దాన్ని తినేందుకు ఇష్టపడరు.

కానీ ఆరోగ్యపరంగా కాకరకాయ అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది.అలాగే జుట్టు సంరక్షణకు( Hair Care ) కూడా తోడ్పడుతుంది.

కాకరకాయ రసాన్ని( Bitter Gourd Juice ) జుట్టుకు రాయడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి.అందుకోసం ముందుగా ఒక కాకరకాయను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Advertisement
Do You Know The Benefits Of Applying Bitter Gourd Juice On Hair Details, Bitter

ఇలా క‌ట్ చేసుకున్న‌ ముక్కలను మిక్సీ జార్ లో వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఒక స్ప్రే బాటిల్ లో కాకరకాయ జ్యూస్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Do You Know The Benefits Of Applying Bitter Gourd Juice On Hair Details, Bitter

కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింక్‌, విటమిన్ సి మరియు ఫోలిక్స్ ఆమ్లం జుట్టు కుదుళ్ల‌ను బ‌ల‌ప‌రిచి.జుట్టు రాల‌డాన్ని( Hairfall ) నిరోధిస్తాయి.కాకరకాయకు రక్త ప్రసరణను మెరుగుపరచే గుణాలు ఉన్నాయి.

కాక‌ర‌కాయ ర‌సాన్ని త‌ల‌కు రాయ‌డం వ‌ల్ల బ్ల‌డ్ స‌ర్క్యులేష‌న్ మెరుగుప‌డి హెయిర్ గ్రోత్( Hair Growth ) ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు ద‌ట్టంగా పెరుగుతుంది.

Do You Know The Benefits Of Applying Bitter Gourd Juice On Hair Details, Bitter
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025
ఢిల్లీపై ఫారిన్ మహిళ లవ్.. నెగిటివ్ టాక్‌కు చెక్ పెడుతూ వైరల్ వీడియో!

అలాగే చుండ్రు( Dandruff ) స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్న‌వారికి కాక‌ర‌కాయ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.వారానికి ఒక‌సారి కాక‌ర‌కాయ ర‌సాన్ని త‌ల‌కు ప‌ట్టిస్తే.అందులోని యాంటీ ఫంగల్ గుణాలు త‌ల చ‌ర్మంపే ఉండే ఫంగల్ సంక్రమణలను నివారించి, డ్యాండ్రఫ్‌ను తగ్గిస్తాయి.

Advertisement

అంతేకాకుండా కాక‌ర‌కాయ ర‌సాన్ని హెయిర్ కు రాయ‌డం వ‌ల్ల జుట్టు చిట్ల‌డం, విర‌గ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.కురుల‌కు చ‌క్క‌ని పోష‌ణ అందుతుంది.జుట్టు షైనీగా మెరుస్తుంది.

తాజా వార్తలు