ఆంజనేయ స్వామి పుట్టుక ఎలా జరిగిందో తెలుసా..?

ఆంజనేయ స్వామి కేసరి, అంజనాలకు జన్మించాడని పండితులు చెబుతున్నారు.హనుమంతు( Hanuman )కు వాయుదేవుని ఖగోళ కుమారుడు అని కూడా చెబుతూ ఉంటారు.

హనుమంతుని తల్లి అంజనాదేవి.ఆమె అప్సరస.

శాపం కారణంగా వానర రూపం ధరించి సంతానం కలగడంతో శాప విముక్తి పొందింది. వాల్మీకి రామాయణం( Ramayana ) ప్రకారం హనుమంతుడి తండ్రి కేసరి కిష్మాంధ రాజ్యానికి సమీపంలో సుమేరుని ప్రాంతానికి రాజు.

కేసరి బృహస్పతి కుమారుడు.

Advertisement

అలాగే చాలా కాలం కేసరి అంజనాదేవిలకు సంతానం కలగలేదు.అంజనాదేవి పుష్కరకాలం శివుని( Lord shiva ) కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై రుద్రుని అంశాతో కుమారుడు జన్మిస్తాడు అని ఎవరు ఇచ్చాడు.రామాయణం ప్రకారం దశరథ మహారాజు పుత్రకామేష్టి యోగం చేసి ఆ యుగంలో వచ్చిన పయాసమును పంచుతుండగా ఒక పక్షి ఆ పయాసం లోని కొంత భాగాన్ని లాక్కుని వెళ్ళింది.

ఆ భాగం అంజనాదేవి పూజలో నిమగ్నమై ఉన్న అడవి పై ఎగురుతున్నప్పుడు, ఆ పాయస భాగాన్ని జార విడిచిందని ఆ పాయసాన్ని వాయువు అంజనాదేవికి అందించాడని, అలా వాయు ద్వారా అందుకున్న పాయసాన్ని స్వీకరించిన అంజనాదేవి హనుమంతుని కుమారునిగా పొందిందని ఒక కథ ప్రచారంలో ఉంది.

అలాగే హనుమాన్ జయంతి రోజు కేసరి, అంజనా దేవి, వాయుదేవున్ని, హనుమంతుని స్మరించుకుని ఆంజనేయస్వామిని పూజించినటువంటి వారికి బాధలు తొలగిస్తే సిద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శని బాధలు, కుజ దోషాలు వంటివి తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.అలాగే హనుమాన్ జయంతి రోజు సాయంత్రం హనుమంతుని పూజించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే7, మంగళవారం 2024
Advertisement

తాజా వార్తలు