విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్( Vellampalli Srinivas ) నామినేషన్ వేశారు.ఈ మేరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లిన వెల్లంపల్లి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే టీడీపీ నేత బోండా ఉమపై( Bonda Uma ) వెల్లంపల్లి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.నియోజకవర్గ ప్రజలను ఓటు అడిగే హక్కు బోండా ఉమకు లేదన్నారు.
బోండా ఉమ విజయవాడ సెంట్రల్ లో( Vijayawada Central ) రౌడీయిజం, గుండాయిజం చేయడంతో పాటు పలు స్థలాలను కబ్జా చేశాడని ఆరోపించారు.అంతేకాకుండా కాల్ మనీ, సెక్స్ రాకెట్ వంటి వాటిలో బోండా ఉమ పాత్ర ఉందని విమర్శించారు.
అతి ముఖ్యంగా సీఎం జగన్ పై దాడి చేయించారని మండిపడ్డారు.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో బోండా ఉమకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారని వెల్లంపల్లి స్పష్టం చేశారు.







