అల్లూరి బయోపిక్ తీస్తానని చెబుతున్న కృష్ణవంశీ.. రామ్ చరణ్ హీరోగా నటిస్తారా?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ( Krishnavamsi ) గురించి మనందరికీ తెలిసిందే.కృష్ణవంశీ ఎన్నో సినిమాలను తెరకెక్కించి డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఇకపోతే కృష్ణవంశీ అల్లూరి సీతారామరాజు బయోపిక్ తీయాలని అనుకుంటున్నారట.అయితే గతంలో ఆయన వందేమాతరం పేరుతో ఒక భారీ దేశభక్తి సినిమాని చిరంజీవితో చేయాలని అనుకున్నారట.

కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేట.ఆ తర్వాత బాలకృష్ణతో రైతు అనే సినిమాను తెరకెక్కించాలని పెద్ద ప్లాన్ వేశారట.

కానీ అది కూడా పట్టాలెక్కలేదు.అయితే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ చేయాలన్నది తన ఆలోచనగా కృష్ణవంశీ తెలియచేశారు.

Advertisement
Director Krishna Vamsi Planning For Alluri Biopic, Krishna Vamsi, Alluri Biopic,

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ( Yandamuri Veerendranath )తో కలిసి కృష్ణవంశీ, అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం మేజర్ పంచాయితీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామానికి సోమవారం వెళ్ళారు.అక్కడ అల్లూరి సీతారామరాజు( Alluri Seetharama Raju ), గంటం దొర సమాధులను వారు సందర్శించారట.

అయితే అక్కడ కొంతసేపు గడిపిన కృష్ణవంశీ మాట్లాడుతూ.అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను సందర్శించాలనే చిరకాల కోరిక ఇప్పుడు తీరింది అని అన్నారు.

సీనియర్ జర్నలిస్ట్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం పుస్తకం తనను ఎంతో ఆకట్టుకుందని, దాదాపు ఇరవై సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఆయన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను గ్రంధస్థం చేశారని కృష్ణవంశీ తెలిపారు.

Director Krishna Vamsi Planning For Alluri Biopic, Krishna Vamsi, Alluri Biopic,

దానిని చదివిన తర్వాత మన్యం వీరుడు అల్లూరి తిరిగిన ప్రదేశాలను చూడాలనే కోరిక మరింత బలపడిందని ఆయన అన్నారు.అల్లూరి సీతారామరాజు జీవితాన్ని బేస్ చేసుకుని ఒక చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన తనకు ఎంతోకాలంగా ఉందని, దానికి సంబంధించిన పని కొంత కాలంగా చేస్తున్నానని కృష్ణవంశీ తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణవంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

భారతీయులకు అమెరికాలో గ్రీన్ కార్డు పై కొత్త సవాళ్లు?
రూల్స్ పెడితే నాకు నచ్చదు.... మాజీ భర్తకు కౌంటర్ ఇచ్చిన సమంత! 

అయితే కృష్ణవంశీ అల్లూరి బయోపిక్ గురించి తన మనసులో మాట చెప్పగానే చాలామంది దీనిని ఎవరితో ఆయన చేస్తారా అనే ఆలోచన మొదలు పెట్టారు.చిరంజీవితో వందేమాతరం చేయలేక పోయిన కృష్ణవంశీ దానిని రామ్ చరణ్( Ram Charan ) తో అయినా చేయాలని అనుకున్నారట.

Advertisement

అయితే చెర్రీతో గోవిందుడు అందరివాడేలే మూవీ చేశారు కృష్ణవంశీ.ఈ సినిమా ఘన విజయం సాధించకపోయినా చిత్రబృందానికి మంచి పేరే తెచ్చిపెట్టింది.మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది.

ఫిల్మ్ మేకర్స్ గా కృష్ణవంశీ అంటే ఇప్పటికీ చిరంజీవి, రామ్ చరణ్ కు అభిమానమే.ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించి మెప్పించిన రామ్ చరణ్.

కృష్ణవంశీ తెరకెక్కించబోయే అల్లూరి సీతారామరాజులో నటిస్తే బాగుంటుందని మెగాభిమానులు భావిస్తున్నారు.మరి అభిమానులు కోరుకుంటున్నట్టుగా కృష్ణవంశీ అల్లూరి సీతారామరాజు సినిమాను రామ్ చరణ్ తో తెరకెక్కిస్తారా లేదంటే మరే ఇతర హీరోతో తెరకెక్కిస్తారా అన్నది చూడాలి మరి.

తాజా వార్తలు