Vedam Movie: వేదం సినిమాలో కర్పూరం రోల్ మొదటగా ఎవరు చేయాలనుకున్నారో తెలుసా ?

అల్లు అర్జున్, మంచు మనోజ్ హీరోలుగా నటించిన వేదం సినిమా( Vedam Movie ) సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ మూవీ ఆలోచింపజేసేలా ఉంటుంది.

అల్లు అర్జున్( Allu Arjun ) పెర్ఫార్మెన్స్ టాప్ నాచ్‌ అని చెప్పవచ్చు.ఇందులోని పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి.

దీనిని అంత గొప్పగా తెరకెక్కించింది మరెవరో కాదు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి. ఈ సినిమా టీవీలో వస్తే ఇప్పటికీ లక్షల మంది చూసేవారు ఉన్నారు.

అయితే తాజాగా దీనికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ సీక్రెట్ బయటికి వచ్చింది.అదేంటంటే ఈ సినిమాలో అనుష్క పక్కన కనిపించే కర్పూరం రోల్‌ను డైరెక్టర్ క్రిష్ చేద్దామనుకున్నాడట.

Advertisement

ఈ సంగతి తెలిసి "వద్దు రా బాబు అలాంటి క్యారెక్టర్ చేస్తే పెళ్లి కూడా కాదు" అని అతడి తల్లి నెత్తి నోరు బాదుకుందట.అందుకే క్రిష్ ఆ క్యారెక్టర్ చేయాలనే ఆలోచనను విరమించుకున్నాడు.

అయితే క్యారెక్టర్ లో ఎవరిని నటింపజేద్దామా అని ఆలోచిస్తుంటే అనుష్క( Anushka ) తన మేకప్ మ్యాన్ నిక్కీని( Makeup Man Nicky ) సజెస్ట్ చేసిందంట.అలా అనుష్క శెట్టి మేకప్ మ్యాన్ ఈ పాత్ర చేసే అవకాశం దక్కించుకున్నాడు.

నిజానికి అతడు మేకప్ పర్సన్ అయినా ప్రొఫెషనల్ యాక్టర్ గా చక్కగా నటించి మెప్పించాడు.

అయితే వేదం సినిమాలో ఎలాగైనా కనిపించాలనే కోరికతో స్వామీజీ పాత్రలో డైరెక్టర్ క్రిష్( Director Krish ) కనిపించి ఆశ్చర్యపరిచాడు.కృష్ణ "రూపాయి" పాటలో ఒక సాధువుగా కనిపిస్తాడు.మీరు ఆ పాటను సరిగ్గా చూస్తే అతన్ని సాధువుగా ఏదో చుట్టు లాంటిది తాగుతున్నట్లు గమనించవచ్చు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

మొత్తం మీద ఈ సినిమాలో తాను ఒక భాగం కావాలనుకున్న కోరికను నెరవేర్చుకున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్లుగా అనుష్క తో పాటు దీక్షా సేథ్, లేఖ వాషింగ్టన్ నటించారు.

Advertisement

ఇకపోతే 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా చాలామంది అవార్డులను గెలుచుకుంది.అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు గెలిస్తే, ముసలాయన నాగయ్య కు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది.బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ ఫిలిం నంది అవార్డ్స్ కూడా దీనికి లభించాయి.

అల్లు అర్జున్ మళ్లీ ఇలాంటివి సినిమా తీయనే లేదు.సమాజంపై ఒక ప్రభావం చూపించే ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావాలి.

ప్రేక్షకులు వీటిని ఎప్పటికీ ఆదరిస్తూనే ఉంటారు.

తాజా వార్తలు