అందుకే పోసాని కృష్ణమురళి నటించిన సన్నివేశాలను డిలీట్ చేసామంటున్న దర్శకుడు...

తెలుగులో ఒకప్పుడు బొమ్మరిల్లు పరువు ఒంగోలు గిత్త ఆరెంజ్ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ దర్శకుడు "బొమ్మరిల్లు భాస్కర్" గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ప్రస్తుతం తెలుగులో "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" అనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

కాగా ఈ చిత్రంలో హీరోగా అక్కినేని అఖిల్ నటిస్తుండగా హీరోయిన్ గా టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.అలాగే ఈ చిత్రంలో ఆమని, ఈషా రెబ్బ, వెన్నెల కిషోర్, మురళి శర్మ, ప్రగతి, పోసాని కృష్ణ మురళి, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

కాగా ప్రముఖ సింగర్ "చిన్మయి శ్రీపాద" మరియు టాలీవుడ్ హీరో "రాహుల్ రవీంద్రన్" గెస్ట్ పాత్రలో నటిస్తున్నారు.కాగా ఇటీవలే ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ మరియు హీరో అక్కినేని అఖిల్ ఇద్దరూ కలసి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.అయితే ఇందులో ముఖ్యంగా ఈ చిత్రంలో నటించిన నటీనటులు గురించి తెలియజేస్తూ షూటింగ్ సమయంలో జరిగినటువంటి సంఘటన గురించి చర్చించారు ఇందులో భాగంగా ఈ చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించిన ప్రగతి పలు సెంటిమెంటల్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్న సమయంలో కొంతమేర ఎమోషనల్ అయిందని అంతేకాకుండా ఈ చిత్ర కథకి నటి ప్రగతి చాలా బాగా కనెక్ట్ అయ్యిందని అందువల్లనే భావోద్వేగాలకు గురైందని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ చెప్పుకొచ్చాడు.

Advertisement

అయితే ఈ చిత్రంలో దర్శకుడు మరియు నటుడు పోసాని కృష్ణ మురళి తో కలిసి కోర్టు ఈ సన్నివేశాలను తెరకెక్కించామని ఈ సన్నివేశాలలో హీరో అక్కినేని అఖిల్ నటుడు పోసాని కృష్ణమురళి కి ఆపోజిట్ లాయర్ గా నటించాడని ఈ సన్నివేశాలు మొత్తం చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.అయితే గతంలో కూడా నటుడు పోసాని కృష్ణమురళి తో తాను బొమ్మరిల్లు చిత్రంలో ఓ సన్నివేశాన్ని తెరకెక్కించామని కానీ ఆ సన్నివేశం సినిమాకి పెద్దగా సూటవ్వకపోవడంతో డిలీట్ చేశామని ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు నటుడు పోసాని కృష్ణ మురళితో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రం అక్టోబర్ నెల 15వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో బ్రహ్మాండంగా విడుదలవుతోంది.కాగా గత కొద్దికాలంగా సరైన హిట్ లేక పోవడంతో హీరో అక్కినేని అఖిల్ తన సినీ కెరీర్ కోసం బాగానే కష్టపడుతున్నాడు మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు