అంత గొప్ప వ్యక్తినే ట్రోల్ చేశారు నేనెంత.. దర్శకుడు బాబీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్లలో దర్శకుడు బాబీ( Director Bobby ) ఒకరు.

డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమాతో బాబీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.

నైజాంలో మంచి థియేటర్లు దక్కి ఉంటే డాకు మహారాజ్ మూవీ మరింత మెరుగ్గా కలెక్షన్లను సొంతం చేసుకుని ఉండేదని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.తన సినీ కెరీర్ గురించి బాబీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.తాను 2003 సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి వచ్చానని బాబీ అన్నారు.2012 సంవత్సరం వరకు నేను రైటర్ గా కెరీర్ ను కొనసాగించానని ఆయన చెప్పుకొచ్చారు.2012 వరకు నా జర్నీ ఒకింత నిదానంగా సాగిందని ఆయన చెప్పుకొచ్చారు.నేను ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని ఆ తర్వాత రవితేజ బలుపు సినిమాకు( Balupu Movie ) కథ అందించానని బాబీ వెల్లడించారు.

Director Bobby Comments Goes Viral In Social Media Details, Director Bobby, Daak

ఆ సినిమాకు కథ అందించడం నా లైఫ్ ను మలుపు తిప్పిందని బాబీ చెప్పుకొచ్చారు.నెగిటివ్ రివ్యూల గురించి బాబీ మాట్లాడుతూ ఒకప్పుడు నెగిటివ్ రివ్యూలు( Negative Reviews ) సరదాగా మొదలయ్యాయని ప్రస్తుతం సినిమా మొదలైన వెంటనే ఎవరో ఒకరు రివ్యూ ఇచ్చేస్తున్నారని బాబీ కామెంట్లు చేశారు.ఏ ఇద్దరి అభిప్రాయం ఒకేలా ఉండదని అంతమంది కష్టాన్ని ఒకే మాటతో చంపేయడం చాలా తప్పు అని బాబీ తెలిపారు.

Director Bobby Comments Goes Viral In Social Media Details, Director Bobby, Daak

బాహుబలి విడుదలైన సమయంలో రాజమౌళిని( Rajamouli ) సైతం ట్రోల్ చేశారని అంత గొప్ప వ్యక్తినే ట్రోల్స్ చేసిన సమయంలో నేనెంత అని అనుకుంటానని బాబీ వెల్లడించారు.సినిమాలో దమ్ము ఉంటే అదే చరిత్ర సృష్టిస్తుందని వాల్తేరు వీరయ్య సినిమాకు సైతం తక్కువ రేటింగ్స్ ఇచ్చినా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని బాబీ చెప్పుకొచ్చారు.బాబీ తర్వాత ప్రాజెక్ట్స్ గురించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement
Director Bobby Comments Goes Viral In Social Media Details, Director Bobby, Daak
వెంకీ అట్లూరి బాటలోనే నడుస్తున్న అజయ్ భూపతి...

తాజా వార్తలు