గజిని సీక్వెల్ గురించి మురుగదాస్ క్లారిటీ ఇదే.. ఈ సీక్వెల్ అలా ఉండబోతుందా?

సూర్య( Suriya ) హీరోగా మురుగదాస్( AR Murugadoss ) డైరెక్షన్ లో తెరకెక్కిన గజిని సినిమా( Ghajini Movie ) అప్పట్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమా హిందీలో రీమేక్ కాగా హిందీలో సైతం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

సికిందర్ మూవీ( Sikandar Movie ) ప్రమోషన్స్ లో భాగంగా గజిని2 గురించి మురుగదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.గజిని సీక్వెల్( Ghajini Sequel ) రూపొందించే అవకాశం ఉందని నా మైండ్ లో ఒక ఆలోచన ఉందని మేము కూర్చుని దాని గురించి డిస్కస్ చేయాల్ని అంతా సవ్యంగా జరిగితే మాత్రమే మేము సీక్వెల్ చేయగలమని నాకు ఒక బేసిక్ ఐడియా ఉందని కానీ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయాలని మురుగదాస్ చెప్పుకొచ్చారు.

గజిని సీక్వెల్ ను తమిళం, హిందీ భాషల్లో ఏక కాలంలో చేయాలని ఉందని మురుగదాస్ వెల్లడించారు.

Director Ar Murugadoss Clarity On Ghajini Movie Sequel Details

గజిని సినిమా విడుదలై చాలా సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారని ఆయన కామెంట్లు చేశారు.ఒక రైటర్ గా, డైరెక్టర్ గా ఆ సినిమాను బాగా తీశానని భావిస్తానని ఆయన పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో గజిని సీక్వెల్ తెరకెక్కడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Director Ar Murugadoss Clarity On Ghajini Movie Sequel Details
Advertisement
Director Ar Murugadoss Clarity On Ghajini Movie Sequel Details-గజిని

అయితే గజిని సీక్వెల్ కు స్కోప్ లేదని ఫస్ట్ పార్ట్ మ్యాజిక్ ను సెకండ్ పార్ట్ రిపీట్ చేయడం సులువైన విషయం కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.గజిని సీక్వెల్ ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.దర్శకుడు మురుగదాస్ కు పూర్వ వైభవం రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

గజిని సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద 2000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు