చిరంజీవి ఆ స్టార్ హీరోయిన్ వద్ద కోటి రూపాయిలు అప్పు చేశాడా..!

ఒక్కో సినిమాకి కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని తీసుకునే హీరోలు, హీరోయిన్లు అప్పుడప్పుడు కొన్ని సార్లు చిన్న చిన్న అప్పులు చెయ్యాల్సి ఉంటుంది.

వాళ్ళ మధ్య ఏమి జరిగిందో, ఎందుకు అలా తీసుకోవాల్సి వచ్చిందో మనకి తెలియదు.

కేవలం వాళ్ళ మధ్య మాత్రమే ఉండే విషయాలు అవి.అలా మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కూడా అప్పట్లో ఒక స్టార్ హీరోయిన్ వద్ద కోటి రూపాయిలు అప్పు తీసుకొని హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో( Banjara Hills ) కొన్ని ఫ్లాట్స్ కొనుగోలు చేసాడని అప్పట్లో ఒక టాక్ ఉండేది.చిరంజీవి అప్పటికే ఇండస్ట్రీ లో హీరోగా నిలదొక్కుకుంటున్నాడు కానీ, పెద్ద స్టార్ మాత్రం అప్పటికి ఇంకా కాలేదు.

హీరోయిన్ రాధికా తో ఆయన చాలా సినిమాలు అప్పటికే చేసి ఉన్నాడు.అందువల్ల వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉండేది.ఇప్పటికీ వీళ్లిద్దరు ఎంతో మంచి స్నేహితులుగా కొనసాగుతూ ఉన్నారు.

చిరంజీవి కుటుంబం లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా కచ్చితంగా రాధికా ఉండాల్సిందే , అలా ఉంటుంది వీళ్ళ మధ్య బాండింగ్.

Did Chiranjeevi Owe Crores Of Rupees To That Star Heroine , Chiranjeevi, Banjara
Advertisement
Did Chiranjeevi Owe Crores Of Rupees To That Star Heroine , Chiranjeevi, Banjara

అయితే అప్పట్లో రాధికా( Radhika ) చిరంజీవి కంటే పెద్ద స్టార్.తెలుగు మరియు తమిళం భాషల్లో క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతుంది.అయితే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కి చెన్నై నుండి షిఫ్ట్ అవ్వడం తో జూబ్లీ హిల్స్ మరియు బంజారా హిల్స్ లోని ఫ్లాట్స్ కి మంచి గిరాకీ ఏర్పడింది.

ఒక మంచి ఆఫర్ రావడం తో చిరంజీవి కొన్ని ఫ్లాట్స్ ని కొనుగోలు చెయ్యాల్సి వచ్చింది.అయితే అప్పటికే ఆయన దగ్గర అంత లిక్విడ్ క్యాష్ ఉండేది కాదు.

అప్పటికి ఆయన ఒక నార్మల్ హీరో కాబట్టి.రాధికా తో తనకి మొదటి నుండి మంచి రిలేషన్ ఉంది కాబట్టి, చిరంజీవి ఆమెకి పరిస్థితి వివరించి కోటి రూపాయిలు( crores of rupees ) అప్పు తీసుకున్నాడట.

ఆ డబ్బులతో బంజారా హిల్స్ లోని కొన్ని భూములను కొనుగోలు చేసాడట.ఆ తర్వాత రెండేళ్లకు మళ్ళీ తీసుకున్న ఆ కోటి రూపాయిలను వడ్డీతో సహా ఇచ్చేశాడట చిరంజీవి.

Did Chiranjeevi Owe Crores Of Rupees To That Star Heroine , Chiranjeevi, Banjara
అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

ఎల్లప్పుడూ నలుగురికి తనకి తోచినంత సహాయం చేసే గుణం ఉన్న చిరంజీవి, ఒకరి దగ్గర అప్పు తీసుకోవడం, అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం అనే చెప్పాలి.ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ హిట్ ని అందుకున్న చిరంజీవి, సెకండ్ హాఫ్ లో భోళా శంకర్ లాంటి డిజాస్టర్ సినిమాని అభిమానులకు అందించాడు.ఇప్పుడు ఆయన భింబిసారా డైరెక్టర్ వసిష్ఠ తో విశ్వంభర అనే చిత్రం చేస్తున్నాడు.

Advertisement

రీసెంట్ గానే షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

తాజా వార్తలు