తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అసెంబ్లీ స్పీకర్ కోసం ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.
కాగా అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక నామినేషన్ దాఖలకు గడువు సాయంత్రం 5 గంటలతో ముగిసిన సంగతి తెలిసిందే.గడువు ముగిసే సమయానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన గడ్డం ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.
ఈ క్రమంలో రేపు అసెంబ్లీలో అధికారిక ప్రకటన వెలువడనుంది.కాగా గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో బీఆర్ఎస్, సీపీఐ నేతలు హాజరై మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే.