ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా ఇంటిని ఇలా డిజైన్ చేయండి..!

మన దేశంలో చాలా మంది ప్రజలు తమ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.

అలాగే వారి ఇంటిలోని వస్తువులను కూడా వాస్తు ప్రకారమే అలంకరించుకుంటూ ఉంటారు.

మరికొంతమంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) అంతగా నమ్మరు.అలాగే ఇంటిని విలాసావంతమైన డిజైన్ చేయించాలని ఆలోచిస్తూ ఉంటారు.

అలాగే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ( Positive energy )రావడానికి ఈ పనులు చేస్తూ ఉంటారు.నిజంగా చెప్పాలంటే పండగల సమయంలో గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించడం లాంటివి చేస్తూ ఉంటారు.

Design The House Like This To Bring Positive Energy Into The House , Vastu , V

ఇది పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అయితే పండగల రోజుల్లోనే కాకుండా మామూలు రోజుల్లోనూ పాజిటివ్ ఎనర్జీని ఇంటికి ఆహ్వానించేలా ప్రధాన ద్వారం ఉండాలంటే వాల్ ఫ్రేమ్( Wall frame ) ను ఏర్పాటు చేయడం మంచిదాని నిపుణులు చెబుతున్నారు.ముందుగా ఇంట్లోకి రాగానే మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలంటే ధ్యానం ముద్రలో ఉన్న బుద్ధుడి ప్రతిమ, తాజా పువ్వులు, క్యాండిల్స్ తో గది నీ అలంకరించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Design The House Like This To Bring Positive Energy Into The House , Vastu , V

ఇలా చేయడం వల్ల ఒత్తిడి మాయమై మనసు ఉల్లాసంగా మారుతుంది.పంచభూతాలైన భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశాలను ఇంటి అలంకరణలో భాగం చేసుకోవడం ఎంతో మంచిది.

Design The House Like This To Bring Positive Energy Into The House , Vastu , V

అందుకు ఇండోర్ ప్లాంట్స్, ( Indoor plants )చిన్న వాటర్ ఫౌండేషన్, క్యాండిల్స్ అలంకరించాలి.గాలి వెలుతురు ధారాళంగా రావడానికి కిటికీలను తెరిచి ఉంచడం వల్ల బయటి ఆకాశం కూడా కనిపించడం వంటి ఇంటీరియర్ డిజైన్ ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే మనకు నచ్చే ఇంటికి సరిగ్గా సరిపోయే ఆర్ట్ వర్క్ ని గోడపై అలంకరించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇందుకోసం తామర పువ్వు,( lotus flower ) నెమలి మండలం ఎంచుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.అలాగే వీటిలో పాజిటివ్ ఎనర్జీని పెంచే గుణాలు కూడా ఉంటాయని చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి10, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు