హైదరాబాద్ లో హవాలా నగదు భారీగా పట్టుబడింది.ఈ మేరకు బంజారాహిల్స్ లో రూ.3.35 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నగదును స్వాధీనం చేసుకున్న అనంతరం బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.సరైన పత్రాలు లేకుండా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో మరిన్ని వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు.