గన్నవరంలో పవన్ ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరణ

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్టులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానానికి పోలీసులు అనుమతి నిరాకరించారు.

ఈ మేరకు జనసేనాని ప్రత్యేక విమానాన్ని అనుమతించవద్దని ఎయిర్ పోర్టు అధికారులకు పోలీసులు సమాచారం అందించారు.

కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవ్వరికీ చంద్రబాబును కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.కేవలం ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్ ను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.

ఈ క్రమంలోనే పవన్ కు కూడా అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో గన్నవరంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు