ప్రజాస్వామ్య వ్యవస్థ - ఖరీదైన ఎన్నికలు - పాలకులు!

ప్రజాస్వామ్య వ్యవస్థ లో పాలకులను ఎన్నుకోవడంలో ప్రజలది కీలక పాత్ర.

అయితే ప్రజాస్వామ్యం అంటే కేవలం డబ్బు, మద్యం, బలప్రయోగం వంటి ఆయుధాలు ఉపయోగించి ఓటు విలువను దిగజారుతున్న పాలకులకు సరైన సమాధానం చెప్పాలంటే నిజాయితీగా ప్రజాస్వామ్యబద్ధంగా పాలకులను ఎన్నుకోవాలి.

రాజ్యాంగ విలువలు, మానవ హక్కులు, కాలరాస్తున్న నేటి పాలకులు ప్రజాస్వామ్యం అంటే కేవలం డబ్బు పెట్టి ఓట్లను కొనుక్కోవడమే అన్న విధానాన్ని ఈ సమాజంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.సామాన్య మానవుడు ప్రజాస్వామ్య వ్యవస్థ లో పాలకుడిగా ఎన్నిక కావాలంటే సాధ్యమయ్యే పని కాదు అన్న ఆలోచన కలిగే విధంగా నేటి పాలకులు అనుసరిస్తున్న విధానాన్ని మనం ఒక్క సారి గమనించాలి.

ఒక్కసారి తమ ఓటు విలువను డబ్బుకు, మద్యానికి తాకట్టు పెడితే జీవితమంతా మనలను దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చినట్లే అవుతుంది.కాబట్టి ప్రజాస్వామికవాదులు లారా ఈ విషయాన్ని ఆలోచించి ఓటును వెయ్యాలి.

ఇటీవల మునుగోడు లో జరుగుతున్న ఎన్నికల ప్రచార విషయంలో రాజకీయ నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు అనుసరిస్తున్న విధానాన్ని ప్రజాస్వామిక వాదులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.భారతదేశంలో ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉచితాలు, తాయిలాలు, ప్రలోభాలు, రాజకీయ లబ్ధి కోసమే అనే విమర్శ సర్వత్ర వ్యాపించి చర్చనీయాంశంగా మారిన సందర్భంలో సుమారు గత సంవత్సర కాలంగా న్యాయవ్యవస్థను రాజకీయాలను కుదిపివేస్తున్న విషయం గమనించాలి.

Advertisement

దేశవ్యాప్త చర్చకు అనుమతించ వలసిన అవసరం చాలా ఉన్నది.రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల లో పొందుపరచబడిన విద్యా, వైద్యము ,సామాజిక న్యాయము సామాజిక అభివృద్ధి, ఆర్థిక ప్రగతి వంటి అంశాలు సాధారణ పరిపాలన ద్వారా ప్రజలకు సమకూర్చ వలసిన బాధ్యత ప్రభుత్వాలది.

కానీ ఆ వైపుగా జరిగిన జరుగుతున్న నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇటీవలి కాలంలో ఎన్నికల సందర్భంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కూడా ఉచితాలను ప్రకటిస్తూ రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్న విషయం ఒకరకంగా వజ్రోత్సవాల వేళ అవమానమే .ఏ సిద్ధాంత ప్రాతిపదికన లేనటువంటి ఉచిత ,ప్రలోభాలు మరొకవైపున అవకాశవాదం గా మారిన వేళ రాజకీయ పార్టీల యొక్క చిత్తశుద్ధి మీద చర్చించి పాలకుల వైఫల్యాల పైన న్యాయస్థానాల ముందు వాదనలు జరగాల్సిన అవసరం చాలా ఉన్నది.ప్రజలు, ప్రజా సంఘాలు, అఖిల పక్షాలు పట్టించుకోకుంటే దేశం లో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం కూడా ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను తప్పుడు విధానాలను ఎండగట్టడానికి సాహసించ కాకపోతే సామాన్యులకు రక్షణ ఎక్కడిది.

మాజీ సీజేఐ నాయకత్వంలో ఉచి తాలపై చర్చ జరిగింది .సంక్షేమం ఏది? ఉచితాలు ఏవి? అనే అంశం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవచూపి దృష్టిపెట్టి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత పాలకులపై ఉందని మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గౌరవ జస్టిస్ ఎన్వి రమణ దీనికి సంబంధించిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జరిగిన చర్చలో స్పష్టం చేయడం జరిగింది.ఇటీవలి కాలంలో వారు ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఈ అంశం పైన సుదీర్ఘంగా చర్చించవలసిన అవసరం ఉందని చేసిన వ్యాఖ్య న్యాయవ్యవస్థకు , రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, ప్రజలకు ఒక సవాలుగా మిగిలిన నేపథ్యంలో ఈ అంశం అవకాశవాద మా? లేక సిద్ధాంత ప్రాతిపదికన కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనదా? అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రాజకీయపక్షాలు ప్రజలకు ఏవో వాగ్దానాలు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఆ రాజకీయ పార్టీలు ప్రజాధనాన్ని ఉచిత ల పేరుతో వృధా చేస్తున్న వని అందుకే ఉచితాల పేరుతో చేస్తున్న వాగ్దానాలను నిషేధించాలని ఇటీవల భారత సర్వోన్నత న్యాయస్థానం లో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం అందరికీ తెలిసినదే.

అన్ని రాజకీయ పార్టీలు ఈ చర్చలో పాల్గొని ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నాటి సీజేఐ చేసిన సూచన నేపథ్యంలో సుప్రీంకోర్టులో జరిగినటువంటి కేసు విచారణ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే ,కాంగ్రెస్ తోపాటు వైయస్సార్సీపి కూడా ఉచితాల పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ఉద్దేశంతో ప్రకటించే కార్యక్రమాలను మాత్రమే ఉచితాలు అనాలని ప్రజల దుస్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను విస్తృత సామాజిక అవగాహన కలిగిన పథకాలను ఉచితాలు అని అనకూడదని తన అఫిడవిట్లో వైయస్సార్సీపి కోరింది.ఎన్నికల సందర్భంలో మాత్రమే ప్రకటిస్తూ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీల విధానాలను నిరసించవలసిందే.కానీ తమ పార్టీ ప్రభుత్వం మాత్రం అమలు చేస్తున్న అనేక పథకాలు, నవరత్నాలు విభిన్న వర్గాల ఆర్థిక సముద్ధరణకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ఏకరువు పెట్టింది ఏపీ ప్రభుత్వం.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

గ్రామీణ పేదరికం , ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ లోటు, నిరుద్యోగ సమస్య, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మరింత మెరుగైన పరిస్థితుల కోసం కృషి చేస్తున్న తమ ప్రభుత్వ విధానం చట్టబద్ధమైన కర్తవ్యమని వైయస్సార్సీపి నొక్కిచెప్పడం ఇతర రాజకీయ పార్టీలను కూడా ఆలోచింపజేసింది .ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు/వాదనలు,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి వైయస్సార్ పేరున అమలవుతున్న అనేక పథకాలతో పాటు అమ్మఒడి, రైతు భరోసా వంటి పథకాలను కూడా ఉచితాలు గా పరిగణించడాన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఈ పథకాల యొక్క ప్రయోజనాన్ని దీర్ఘకాలిక లబ్ధిని ఆలోచించకుండా జనాకర్షక పథకాలు గా కుదించి చూపడంలో ఔ చిత్యం లేదనే ఏపీ ప్రభుత్వం వాదనను మనము కూడా చర్చించ వలసి ఉన్నద.అయితే రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల లో పేర్కొన్న టువంటి అంశాలకు సంబంధించి ఆచరణలో అందుకు భిన్నంగా ఉంటున్న కారణంగా ఏపీ ప్రభుత్వ వాదన పైన నే కాకుండా, మిగతా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగము, ప్రజల హక్కులు అనే కోణంలో ప్రభుత్వ పథకాలను ఆలోచించినప్పుడు మాత్రమే ప్రభుత్వాల తప్పుడు విధానాలకు కళ్ళెం పడుతుంది .వాగ్దానాలకు కాలము చెల్లుతుంది.నిజమైన టువంటి అభివృద్ధి సాకారం అవుతుంది .

Advertisement

తాజా వార్తలు