తెలుగు సినిమాకు ఢిల్లీ అల్లర్ల ఎఫెక్ట్

ఇటీవల ఢిల్లీలో జరిగిన అల్లర్లు ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించాయో అందరికీ తెలిసిందే.ఈ అల్లర్లలో ఏకంగా 42 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

అయితే ఈ అల్లర్ల కారణంగా ఢిల్లీలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసిన ప్రభుత్వం అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడే వరకు ఎలాంటి పబ్లిక్ మీటింగ్‌లు, సినిమా షూటింగ్‌లు జరపకూడదని వెల్లడించింది.ఈ ప్రభావం తెలుగు సినిమాపై పడటంతో సదరు చిత్ర యూనిట్ తలపట్టుకున్నట్లు తెలుస్తోంది.

యంగ్ హీరో సందీప్ కిషన్, అందాల భామ లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఏ1 ఎక్స్‌ప్రెస్ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను ఢిల్లీలోని ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం‌లో నిర్వహించాలని ప్లాన్ చేశారు.అయితే అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా ఉండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ చిత్ర షూటింగ్‌కు అనుమతిని ఇవ్వలేదు.

దీంత చిత్ర యూనిట్ ఆ షూటింగ్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించాలని రెడీ అవుతున్నారు.హాకీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Advertisement

ఈ సినిమాను డెనిస్ జీవన్ కనుకొలని డైరెక్ట్ చేస్తుండగా సందీప్ కిషన్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కుచిబొట్ల సంయుక్తంగా నిర్మి్స్తుండగా, హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.

తండేల్ మూవీ సెన్సార్ రివ్యూ వివరాలు ఇవే.. ఆ సన్నివేశాలే మేజర్ హైలెట్!
Advertisement

తాజా వార్తలు