ఢిల్లీ అమ్మాయికి ఊహించని అదృష్టం.. కొత్తగా కొన్న ప్యాంటు జేబులో యూరోలు.. అసలేమైందంటే?

ఢిల్లీలోని ఫేమస్ జాన్‌పథ్ మార్కెట్‌లో( Janpath Market ) నైనా అనే అమ్మాయి కొన్న ప్యాంటులో ఊహించని షాక్ తగిలింది.ఆ ప్యాంటు జేబులో( Pant Pocket ) ఏకంగా 10 యూరోలు (మన కరెన్సీలో దాదాపు రూ.

929) దొరికాయి.బంగారు రంగు ప్యాంటు, రెండు 5 యూరో నోట్ల ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్( Viral ) అయిపోయింది.

మూడు లక్షల వ్యూస్‌తో నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.కొందరైతే దీన్ని రియల్ లైఫ్ క్యాష్‌బ్యాక్, లక్కీ రీఫండ్ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం ఈ బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

జాన్‌పథ్, సరోజినీ నగర్ లాంటి తక్కువ ధరల మార్కెట్లలో యూరప్ నుంచి సెకండ్ హ్యాండ్ బట్టలు దిగుమతి అవుతాయని చాలా మంది నెటిజన్లు అంటున్నారు.చనిపోయిన వాళ్ల బట్టలు, డొనేషన్లు కూడా ఇలా అమ్ముతారని టాక్.

Delhi Girl Finds 10 Euros Inside Pant Purchased From Janpath Market Viral Detail
Advertisement
Delhi Girl Finds 10 Euros Inside Pant Purchased From Janpath Market Viral Detail

@Oye_M_G అనే యూజర్, "షాపుల్లో బట్టలు అమ్మే ముందు జేబుల్లో డబ్బులు ఉన్నాయో లేదో చూస్తారు.కానీ ఈసారి మాత్రం మిస్ అయి ఉంటారు.అందుకే కొన్న అమ్మాయికి లక్కీ ఛాన్స్ తగిలింది" అని కామెంట్ చేశాడు.

ఇంకో యూజర్ ఇంకా ఫన్నీగా, "నైనా ఆ ప్యాంటు వెయ్యి రూపాయల లోపే కొని ఉంటే, ఇది ఫ్రీగా వచ్చేసినట్లే" అని పంచ్ వేశాడు.

Delhi Girl Finds 10 Euros Inside Pant Purchased From Janpath Market Viral Detail

ఇంతలో గ్రోక్ అనే AI చాట్‌బాట్ కూడా స్పందించింది.జాన్‌పథ్, సరోజినీ నగర్ మార్కెట్లలో అమ్మే బట్టలు చాలా వరకు ఎక్స్‌పోర్ట్ మిగిలిపోయినవి లేదా ఫ్యాక్టరీలో రిజెక్ట్ అయినవే కానీ, యూరప్ నుంచి తెచ్చిన సెకండ్ హ్యాండ్ బట్టలు కావని క్లారిటీ ఇచ్చింది.ఏదేమైనా నైనాకు దొరికిన యూరోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

కొందరు దీన్ని ఫన్నీ ఇన్సిడెంట్‌గా తీసుకుంటే, మరికొందరు మాత్రం మార్కెట్‌లోకి బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే చర్చను మళ్లీ మొదలుపెట్టారు.

వైరల్‌ వీడియో : బెడ్‌రూమ్‌లోకి దూసుకెళ్లిన ఆవు, ఎద్దు.. చివరకు?
Advertisement

తాజా వార్తలు