మస్కిటో కాయిల్స్ వాడుతున్నారా? అయితే మీ హెల్త్ రిస్క్‌లో ప‌డ్డ‌ట్టే!

దోమ‌లు.దాదాపు ప్ర‌తి ఒక్క‌రి ఇళ్ల‌ల్లోనూ తిరిగే ర‌క్క‌సి కూన‌లివి.

అందులోనూ ప్ర‌స్తుతం  ఈ చ‌లి కాలంలో దోమ‌లు మ‌రింత ఎక్కువై పోతుంటాయి.

దాంతో వాటిని త‌రిమి కొట్టేందుకు చాలా మంది మ‌స్కిటో కాయిల్స్‌ను యూజ్ చేస్తుంటారు.

సాయంత్రం ఆరు అయిందంటే చాలు ఇంట్లో నుంచి దోమ‌ల‌ను వెళ్ల‌గొట్టేందుకు అంద‌రూ మ‌స్కిటో కాయిల్స్‌ను వెలిగించేస్తుంటారు.ఈ లిస్ట్‌లో మీరూ ఉన్నారా? అయితే మీ హెల్త్ రిస్క్‌లో ప‌డ్డ‌ట్టే.అవును, మ‌స్కిటో కాయిల్స్ ను రోజూ యూజ్ చేస్తే కోరి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చుకున్న‌ట్టే అవుతుంది.

వాస్త‌వానికి దోమ‌ల‌ను అంతం చేసే మ‌స్కిటో కాయిల్స్ మ‌న‌షుల‌కూ ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైన‌వి.మ‌స్కిటో కాయిల్స్ త‌యారీలో ఎన్నో ర‌సాయ‌నాల‌ను యూజ్ చేస్తుంటారు.అందు వ‌ల్ల వాటి పొగ‌ను రోజూ పీలిస్తే శ్వాస కోశ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి.

Advertisement
Dangerous Side Effects Of Mosquito Coil! Side Effects Of Mosquito Coil, Mosquito

ఆస్త‌మాతో బాధ ప‌డే వారు మ‌స్కిటో కాయిల్స్ పొగ‌ను పీలిస్తే.వ్యాధి మ‌రింత తీవ్రంగా మారుతుంది.

Dangerous Side Effects Of Mosquito Coil Side Effects Of Mosquito Coil, Mosquito

అలాగే ఈ పొగ‌ను పీల్చ‌డం వ‌ల్ల లేని వారికి కూడా ఆస్త‌మా వ్యాధి వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది.మస్కిటో కాయిల్స్‌లో ఉండే కెమిక్స‌ల్ కంటి స‌మ‌స్య‌లను‌ కూడా  తెచ్చి పెడ‌తాయి.ముఖ్యంగా కంటి చూపు త‌గ్గ‌డం, మంట‌లు పుట్ట‌డం వంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా ఇబ్బంది పెడ‌తాయి.

మ‌స్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ చ‌ర్మాన్ని సైతం ప్ర‌భావితం చేస్తుంది.చ‌ర్మంపై ర్యాషెస్ రావ‌డం, దుర‌ద‌లు, అల‌ర్జీ వంటివి త‌లెత్తే అవ‌కాశం ఉంటుంది.అంతే కాదు, మస్కిటో కాయిల్స్ యొక్క పొగ‌ను పీలిస్తే గ‌నుక ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, త‌ల నొప్పి వంటి స‌మ‌స్య‌లు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడ‌తాయి.

అందువ‌ల్ల‌, మ‌స్కిటో కాయిల్స్‌తో ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిద‌ని చెబుతున్నారు నిపుణులు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు