CM YS Jagan : సీఎం జగన్ కి పొంచి ఉన్న ప్రమాదం…ఇంటెలిజెన్స్ నివేదిక..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ కి( CM YS Jagan ) మావోయిస్టులు, టెర్రరిస్టులు సంఘవిద్రోహశక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక( Intelligence Report ) ఇవ్వడం జరిగింది.

దీంతో సీఎంకు అత్యంత భద్రత కల్పించాల్సి ఉంటుందని డీజీపీ భావించడం జరిగింది.

ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ కి జడ్ కేటగిరీ భద్రత ఉంది.తాజాగా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ప్రభుత్వం మరింత జాగ్రత్త వహించి కీలక నిర్ణయం తీసుకుంది.

సీఎం పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లను లీజుకు తీసుకోనుంది.ఇందుకు మెస్సర్స్ గ్లోబర్ వెక్జా సంస్థకు ఒక్కో హెలికాప్టర్ కీ నెలకు రూ.1.91 కోట్ల లీజ్ చెల్లించనుంది.

Danger Lurking For Cm Jagan Intelligence Report

ఒకటి విజయవాడలో, మరొకటి విశాఖలో ఉంచనుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలలలో ఎన్నికలు( AP Elections ) జరగనున్నాయి.ఇప్పటికే ఎన్నికల విషయంలో సీఎం జగన్ వరుస పెట్టి పర్యటనలు చేపడుతున్నారు.

Advertisement
Danger Lurking For Cm Jagan Intelligence Report-CM YS Jagan : సీఎం జ�

ఒకపక్క ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూనే మరోపక్క పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. "సిద్ధం" ( Siddham ) అనే టైటిల్ తో ఇప్పటికే మూడు బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది.

Danger Lurking For Cm Jagan Intelligence Report

బహిరంగ సభలకు భారీ ఎత్తున జనాలు హాజరవుతున్నారు.2024 ఎన్నికలను వైఎస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఎట్టి పరిస్థితులలో గెలిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ప్రచారం విషయంలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇటువంటి పరిస్థితులలో సంఘవిద్రోహశక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇవ్వడం సంచలనంగా మారింది.

దీంతో ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి భద్రత విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.

మంత్రులకు తప్పిన పెను ప్రమాదం!
Advertisement

తాజా వార్తలు