వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది ఇష్ట‌ప‌డే పానియాల్లోకాఫీ ఒక‌టి అద్భుత‌మైన రుచి, ఫ్లేవ‌ర్ క‌లిగి ఉండే కాఫీ లేకుండా కొంద‌రికి రోజు కూడా గ‌డ‌వ‌దు.

మ‌రికొంద‌రికి ఉద‌యం లేవ‌గానే బెడ్ కాఫీ ఉండాల్సిందే.

ఒక ఒత్తిడిగా ఉన్న స‌మ‌యంలో ఒక క‌ప్పు కాఫీ తాగితే ఎంత రీఫ్రెష్ పొందుతామో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అయితే ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే అంద‌రూ కామ‌న్‌గా చేసే పొర‌పాటు కాఫీ త‌యారు చేసుకున్నాక పొడిని ప‌డేస్తుంటారు.

కానీ, వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ప‌లు విధాలుగా వాడొచ్చు.అదెలాగో చూసేయండి.

ఒక్కో సారి ఫ్రిడ్జ్ లేదా రూమ్ చెడు వాస‌న వ‌స్తుంటాయి.ఆ స‌మ‌యంలో కాఫీ పొడి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement

కాఫీ పొడికి చుట్టుపక్కల వాసనలను గ్రహించే గుణం ఉంటుంది.అందువ‌ల్ల‌, వాడేసిన కాఫీ పొడిని ఒక బౌల్‌లో వేసి గదిలో కానీ లేదా ఫ్రిజ్‌లో కానీ పెడితే అది చెడు వాస‌న‌ను పిల్చేస్తుంది.

అలాగే పాత్ర‌ల‌ జిడ్డును, మ‌ర‌క‌ల‌ను వ‌దిలించ‌డంలోనూ కాఫీ పొడి ఉప‌యోగ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, వాడేసిన కాఫీ పొడిని పాత్ర‌ల క్లీనింగ్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు.

కొంద‌రు కిచెన్ గార్డెన్‌లో ఆకుకూర‌ల‌ను పెంచుకుంటారు.కానీ, ఒక్కోసారి ఆ ఆకుకూర‌ల‌పై పురుగులు చేరి వాటిని తినేస్తుంటాయి.అయితే కాఫీ పొడిని ఉప‌యోగించి ఆ పురుగుల‌ను వ‌దిలించుకోవ‌చ్చు.

వాడేసిన కాఫీ పొడిని వాట‌ర్ వేసి ఆకు కూర‌ల‌కు స్ప్రే చేయాలి.ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

అలాగే వాడేసిన కాఫీ పొడిలో కొద్దిగా నీరు క‌లిపి తల మొత్తానికి ప‌ట్టించాలి.పావు గంట త‌ర్వాత సాధార‌ణ ష్యాంపూతో త‌ల‌స్నానం చేయాలి.

Advertisement

ఇలా చేస్తే జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది.ఇక సింకులో, టాయిలెట్‌లో చెడు వాస‌న వ‌స్తుంటే కాఫీ పొడి చ‌ల్లి ఆ త‌ర్వాత ఏదైనా వాషింగ్ లిక్విడ్ వేసి క‌డిగేయాలి.

ఇలా చేస్తే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండ‌డంతో పాటు క్లీన్‌గా కూడా ఉంటాయి.అలాగే వాడేసిన కాఫీ పొడి ప‌డేయ‌కుండా మొక్క‌ల‌కు ఎరువుగా కూడా వేసుకోవ‌చ్చు.

తాజా వార్తలు