30 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో..!

సూపర్ స్టార్ రజినికాంత్, మణిరత్నం కాంబోలో ఒక సినిమా రాబోతుందని కోలీవుడ్ టాక్.మణిరత్నం డైరక్షన్ లో రజిని నటించిన ఒకే ఒక్క సినిమా దళపతి.

ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.దళపతి సినిమా ఇండియన్ సినిమాల్లో క్లాసిక్ మూవీగా నిలిచింది.1991లో వచ్చిన ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూ ఉంటాయి.ఇక రీసెంట్ గా పొన్నియిన్ సెల్వన్ తో సూపర్ హిట్ అందుకున్న మణిరత్నం పి.ఎస్ 2 కూడా రిలీజ్ చేశాక మరోసారి సూపర్ స్టార్ రజిని తో సినిమాకు రెడీ అవుతున్నాడట.

పి.ఎస్ 2 పనులు పూర్తి చేశాక ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.ఈ సినిమా కథ కూడా జీవితంలో ఉన్నతం.

పతనం రెండు చూసిన ఓ వ్యక్తి కథతో వస్తుందట.రజినితో మణిరత్నం సినిమా అంటే ఖచ్చితంగా ఆ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది.30 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి సినిమా చేయడం మూవీ లవర్స్ కి ఫుల్ జోష్ తెచ్చింది.అంతేకాదు సినిమాపై ఇప్పటికే అంచనాలు కూడా భారీగా పెరిగాయి.

Advertisement

అక్కడే కాదు రజినితో మణిరత్నం మూవీ అనగానే తెలుగు ఆడియన్స్ కూడా ఎక్సయిట్ అవుతున్నారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు