ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ రావు మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది.దీంతో ఆయనను సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
ఈ నేపథ్యంలో అభిషేక్ రావును మరో రెండు రోజులు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది.గడిచిన మూడు రోజుల కస్టడీలో ఆర్థిక లావాదేవీలు, లిక్కర్ పాలసీ సమావేశాలు, హవాలా వ్యవహారాలపై అభిషేక్ ను అధికారులు ప్రశ్నించారు.
ఈ క్రమంలో లిక్కర్ స్కాంకు సంబంధించి కీలక వివరాలు రాబట్టినట్లు సమాచారం.