కరోనా లేకపోతే 2022 మొత్తం ఈ స్టార్ హీరోయిన్స్ దే!

గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల ప్రభావం సినిమా రంగంపై ఎక్కువగా పడిందని చెప్పవచ్చు.

కరోనా కారణం వల్ల సినిమాలన్నీ వాయిదా పడటంతో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుని ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఇప్పటికే పలు చిత్రాలు పోటీలో విడుదల కాగా మరికొన్ని సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.మరి ఈ ఏడాది కరోనా లేకపోతే ఈ స్టార్ హీరోయిన్స్ దే హవా అని చెప్పవచ్చు.

మరి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

దీపికా పదుకొనే:

ఈ సొట్ట బుగ్గల సుందరి తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి కపిల్ దేవ్ బయోపిక్ చిత్రం 83 లో నటించారు.అలాగే హృతిక్ రోషన్‌ ‘ఫైటర్’, షారుక్ ఖాన్‌ ‘పఠాన్‌’, అమితాబ్‌తో చేస్తున్న‘ది ఇంటర్న్’సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కత్రినా కైఫ్:

కత్రినా కైఫ్ అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన సూర్య వంశీ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచింది.ఇక ఈ ఏడాది కత్రినాకైఫ్ నటించిన ‘జీ లే జరా’, ‘ఫోన్ బూత్’, ‘మెరీ క్రిస్‌మస్’, ‘టైగర్ 3’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

జాన్వీ కపూర్:

Advertisement

రాజ్ కుమార్ రావు, జాన్వి కపూర్ జంటగా నటించిన ‘రుహీ’ చిత్రం 2021 మార్చిలో ఓటీటీలో విడుదలైంది.ఇక ఈమె నటించిన  ‘మిలి’, ‘గుడ్ లక్ జెర్రీ’, ‘దోస్తానా 2’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ వంటి చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

అలియా భట్:

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ఈసారి తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించబోతోంది.ఈ క్రమంలోనే ఈమె నటించిన  ‘ఆర్‌ఆర్ఆర్’, ‘గంగుబాయి కతియావాడి’, ‘రాఖీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని’, ‘బ్రహ్మస్త్ర’, ‘జీ లే జరా’ సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు