కార్న్ ‌ఫ్లోర్‌తో ముఖానికి మెరుగులు.. ఎలాగంటే?

యువ‌తీ, యువ‌కుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్మ స‌మ‌స్య‌లు వేధిస్తుంటాయి.మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు, డార్క్ స‌ర్కిల్స్‌, పొడి చ‌ర్మం ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు వెంటాడుతుంటాయి.

అయితే ముఖానికి కొత్త కాంతి అందించ‌డంలోనూ, న‌ల్ల మ‌చ్చ‌లు మ‌రియు మొటిమ‌లు త‌గ్గించ‌డంలోనూ, చ‌ర్మాన్ని మృదువుగా మార్చ‌డంలోనూ కార్న్ ఫ్లోర్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి ముఖానికి కార్న్ ఫ్లోర్ ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు లేట్ చేయ‌కుండా తెలుసుకుందాం.

ముందుగా బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్‌, ఒక స్పూన్ టొమాటో పేస్ట్, కొద్దిగా నిమ్మ‌ర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.

ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఇలా వారినికి రెండు, మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.రెండొవ‌ది.

ఒక బౌల్ తీసుకుని అందులో ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, చిటికెడు ప‌సుపు, ఒక స్పూన్ రోజ్ వాట‌ర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.

అర గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా వారినికి రెండు, మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై ఉన్న మృత‌క‌నాలు పోయి ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది.మూడొవ‌ది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

ఒక బౌల్‌లో టీ స్పూన్ కార్న్ ఫ్లోర్‌, అర టీ స్పూన్ పెరుగు, అర స్పూన్ క‌ల‌బంద గుజ్జు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు అప్లై చేసి.

Advertisement

పావు గంట లేదా ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముడ‌త‌లు పోయి.ముఖం మృదువుగా మారుతుంది.

మ‌రియు మంచి రంగు సంత‌రించుకుంటుంది.

తాజా వార్తలు