ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు వేగవంతం

దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి తాత్కాలిక కార్యాలయం ముస్తాబవుతోంది.

ఈ నెల 14న ఎస్పీ రోడ్డులో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

ఏడాది పాటు భవనాన్ని బీఆర్ఎస్ అద్దెకు తీసుకుంది.కార్యాలయాన్ని ప్రారంభించిన రోజే బీఆర్ఎస్ జాతీయ విధానం, జాతీయ కార్యవర్గాన్ని కేసీఆర్ అదే రోజు ప్రకటించనున్నారు.

కాగా ఇప్పటికే వసంత్ విహార్ లో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేశారు అధికారులు.నాలుగు లేదా ఐదు నెలల్లో బీఆర్ఎస్ భవన్ పనులు పూర్తి చేయాలని ఇటీవల కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు