యాదాద్రి థర్మల్ ప్లాంట్ పై కుట్ర:మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు.

అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే నిర్మాణం మొదలుపెట్టామని,ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఏకపక్షంగా ఉందన్నారు.

ఎన్జీటి తీర్పు యావత్ దేశానికి నష్టం కలిగేలా ఉందని,వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టాక వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం సరైంది కాదని అన్నారు.నిర్మాణం ఆపాలంటూ లేవనెత్తిన అంశాలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయని,ఎక్కడో ఉన్న ముంబై సంస్థకు యాదాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధం ఏంటని ప్రశ్నించారు.

దీని వెనకాల ఖచ్చితంగా కుట్ర దాగి ఉందని, పర్యావరణ అనుమతులు వచ్చాకే నిర్మాణం చేపట్టామని,గతంలో ఇదే సంస్థ కేసు వేసినప్పుడు ట్రిబ్యునల్ కొట్టి వేసిందని గుర్తు చేశారు.కేసు వేసిన ముంబై సంస్థ వెనకాల అదృశ్య శక్తులు ఉన్నాయని, అన్ని చట్టాలకు లోబడే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందన్నారు.

ఎన్జీటి తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని,అనుకున్న సమయానికల్లా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు.యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపాలని వచ్చిన తీర్పుపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.

Advertisement
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్...!

Latest Suryapet News