భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుక ఏర్పాట్లు పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా : భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేస్తున్న ఏర్పాట్లను సిరిసిల్ల ఆర్డీవో రమేష్, ఏఎస్పీ చంద్రయ్య, డీపీఆర్ఓ శ్రీధర్ కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు.

ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరించే స్థలం, స్టేజీ, వీఐపీ, మీడియా, ప్రజల కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలు, వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్టాల్స్ కోసం సిద్ధం చేసిన నిర్మాణాలు పరిశీలించి, పలు సూచనలు సలహాలు అందజేశారు.

అనంతరం వాహనాల పార్కింగ్ ఏరియా, మైక్ సిస్టమ్, జనరేటర్, అలంకరణ పనులను పరిశీలించారు.ఇక్కడ డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల తహసిల్దార్ షరీఫ్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భక్తులతో రద్దీగా మారిన రాజన్న ఆలయం..

Latest Rajanna Sircilla News