భీమ్లా నాయక్ హిందీలో కూడా రిలీజ్.. కన్ఫర్మ్ చేసిన నిర్మాత !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్.

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా పాన్ ఇండియా సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ కోసం రేస్ నుండి తప్పుకుంది.

ఆ తర్వాత భీమ్లా నాయక్ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తాడని ప్రకటించారు.కానీ కరోనా వల్ల మళ్ళీ పరిస్థితులు మారిపోవడంతో ఈ సినిమాకు రెండు రిలీజ్ డేట్ లు ప్రకటించారు.

అన్ని అనుకూలిస్తేనే ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తామని తెలిపారు.దీంతో ఇప్పుడు భీమ్లా నాయక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే ఉత్కంఠ పవర్ స్టార్ అభిమానుల్లో మాత్రమే కాదు.

మాములు ప్రేక్షకుల్లో కూడా కనిపిస్తుంది.అయితే నిన్న భేటీ జరిగి ఏపీ వివాదం ముగియడంతో ఈ సినిమా ఫిబ్రవరి 25 నే రిలీజ్ చేస్తారేమో అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

Confirmed Bheemla Nayak To Release In Hindi , Bheemla Nayak Hindi Release ,bheem
Advertisement
Confirmed Bheemla Nayak To Release In Hindi , Bheemla Nayak Hindi Release ,Bheem

సినిమా రిలీజ్ డేట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భీమ్లా నాయక్ మేకర్స్ కూడా సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి కొత్త అప్డేట్ వచ్చేసింది.

భీమ్లా నాయక్ ను కూడా హిందీలో రిలీజ్ చేయబోతున్నారు.ఈ విషయాన్నీ సినిమా నిర్మాత నాగ వంశీ కన్ఫర్మ్ చేసేసారు.

ఒక ఇంటర్వ్యూ లో ఈయన మాట్లాడుతూ భీమ్లా నాయక్ హిందీలోనూ రిలీజ్ అవుతుంది అని చెప్పారు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుంటే.

రానా దగ్గుబాటి జోడిగా సంయుక్త మీనన్ నటిస్తుంది.ఈ సినిమాను సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

థమన్ సంగీతం అందిస్తున్నారు.మరి ఈ నెలలో వస్తుందో.

Advertisement

లేదంటే ఏప్రిల్ లో వస్తుందో వేచి చూడాలి.

తాజా వార్తలు