Faima : హీరోయిన్ గా ఛాన్స్ వస్తే చేస్తాను.. బిగ్ బాస్ ఫైమా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మొదట పటాస్ షో( Patas Show ) ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఫైమా, ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అలాగే పండుగ ఈవెంట్లకు ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది.

ముఖ్యంగా పైమా కామెడీ టైమింగ్స్ కి యూత్ లో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది.

ప్రస్తుతం పైమా( Faima ) జబర్దస్త్ షోలో బుల్లెట్ భాస్కర్ టీం లో చేస్తున్న విషయం తెలిసిందే.మరొకవైపు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టిన ఫైమా ఆ చానల్ ద్వారా తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఫైమా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social media ) వైరల్ గా మారాయి.మరి ఆ వివరాల్లోకి వెళితే.అయితే ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు తన ఫోటోలని, రీల్స్ ని అప్లోడ్ చేస్తూ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉంటు వస్తోంది ఫైమా.

Advertisement

అయితే తాజాగా ఆస్క్ మి‌ క్వశ్చనింగ్ స్టార్ట్ చేసింది ఫైమా.‌ ఇందులో‌ ఒక్కో అభిమాని‌‌ ఒక్కోలా ప్రశ్నలు వేస్తుంటే వాటికి సమాధానాన్ని తెలియజేసింది.మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ అని ఒక‌రు అడుగగా నేను‌ ప్రతీ‌ సంవత్సరం న్యూ ఇయర్ కి ఏం ప్లాన్ చేయలేదు.

‌పెద్దగా అవసరం లేదు.ఎందుకంటే ఆ రోజు కచ్చితంగా ఏదో ఒక ఈవెంట్ షూటింగ్ ఉంటుందని ఫైమా రిప్లై ఇచ్చింది.

హీరోయిన్ గా అవ్వాలని అనుకున్నారా ఎప్పుడైనా అని ఒకరు‌ అడుగగా అవును అనుకున్నాను.

ఫ్రెండ్ క్యారెక్టర్, అతిథి పాత్ర, సైడ్ క్యారెక్టర్ ఇలా ఒకటి రెండు నిమిషాలు ఇలా వచ్చి అలా వెళ్ళే పాత్రని చేయాలని అనుకోవట్లేదు.లైఫ్ లాంగ్ అందరికి గుర్తుండిపోయే పాత్రని చేయాలని అనుకున్నానంటూ ఫైమా చెప్పింది.ఇలాగే తన ఈవెంట్ బిజీ షెడ్యూల్ గురించి ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది ఫైమా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

కాగా ఇప్పుడు తనకి హీరోయిన్ గా ఛాన్స్ రావాలని చాలామంది అభిమానులు‌ కోరుకుంటున్నారట.అయితే మంచి అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని తన అభిప్రాయాన్ని తెలిపింది ఫైమా.

Advertisement

తాజా వార్తలు