జాతీయ శిక్షణ తరగతులకు ఎంపికైన మట్టిపెళ్లి

సూర్యాపేట జిల్లా: ఈనెల 28 నుండి 31 వరకు కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో జరిగే జరిగే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ శిక్షణ తరగతులకు వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెళ్లి సైదులు ఎంపికయ్యారు.

ఈ శిక్షణ తరగతులలో 29 రాష్ట్రాల నుండి 250 మంది ఎంపిక చేయబడిన ప్రతినిధులు పాల్గొంటున్నట్లు మట్టిపెళ్లి తెలిపారు.

శిక్షణ తరగతులకు ముఖ్య అతిథులుగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయరాఘవన్,బి.వెంకట్,కేరళ రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నట్లు తెలిపారు.

వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి,భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా జూన్ 1,2 తేదీలలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో వాటిని అధ్యయనం చేసేందుకు పలు ప్రాంతాలలో పనిచేస్తున్నట్లు చెప్పారు.

ఢిల్లీ మెట్రోలో యువతి ఓవరాక్షన్.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..
Advertisement

Latest Suryapet News