క్లారిటీ రావడం లేదా ? టీడీపీ ,జనసేన అభ్యర్థుల ప్రకటన ఆలస్యం ? 

ఒకవైపు అధికార పార్టీ వైసిపీ ( YCP )అభ్యర్థుల జాబితాను 4 విడతలుగా ప్రకటించింది.ఐదో జాబితాను రేపో మాపో ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది.

ఇప్పటికే 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 10 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.పూర్తి స్థాయిలో జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టే విధంగా ఆ పార్టీ ప్లాన్ చేస్తుండగా, ఈ రేసులో టిడిపి ,జనసేన పార్టీలు వెనుకబడినట్టుగానే కనిపిస్తున్నాయి.

ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు.టిడిపి( TDP ) బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కొన్నిటిని తమకు కేటాయించాల్సిందిగా జనసేన( Janasena ) కూడా కోరుతుండడం, ఇతర పార్టీల నుంచి కీలక నాయకులు టిడిపి, జనసేన పార్టీలలో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో, అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే విషయంలో మరికొంత ఆలస్యం జరుగుతోందట.

Clarity Is Not Coming Tdp, Jana Sena Candidate Announcement Delayed , Pavan, Pav

ఇప్పటి నుంచే సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల మధ్య ఒక అంగీకారం వచ్చిందనే ప్రచారం జరుగుతున్నా, అందులో వాస్తవం లేదని, సీట్ల సర్దుబాటు విషయంలో సమన్వయం కుదరకపోవడంతోనే రెండు పార్టీల అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా కొన్ని కీలకమైన నియోజకవర్గాల విషయంలో పవన్, చంద్రబాబు మధ్య క్లారిటీ రావడం లేదట.అలాగే టిడిపి సీనియర్లు జనసేన కోసం త్యాగం చేయాల్సి రావడంతో, వారు రెబల్ గా బరిలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపైన చంద్రబాబు సర్వేలు చేస్తున్నారట.

Clarity Is Not Coming Tdp, Jana Sena Candidate Announcement Delayed , Pavan, Pav
Advertisement
Clarity Is Not Coming TDP, Jana Sena Candidate Announcement Delayed , Pavan, Pav

జనసేనకు కేటాయించబోయే నియోజకవర్గాలలోని టిడిపి నేతలను ముందుగానే బుజ్జగించి వారికి ప్రత్యామ్నాయం గా వేరే పదవులు ఇస్తామని ఒప్పించి అప్పుడు ప్రకటన చేస్తే మంచిదని, లేకపోతే మొదటికే మోసం వస్తుందని, వారు రెబల్ గా బరిలోకి దిగితే వైసిపికి కలిసి వస్తుందన లెక్కలు వేసుకుంటున్నారట.ఇవన్నీ రెండు పార్టీల అభ్యర్థుల ఎంపికకు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.ఇదే కాకుండా తమ కూటమిలో చేరేందుకు బిజెపి కూడా సిద్ధమే అన్నట్లుగా సంకేతాలు పంపిస్తుండడంతో, ఆ పార్టీ కోసం మరికొద్ది రోజులు వేచి చూడాలని, ప్రస్తుతం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం వ్యవహారంలో బిజెపి అగ్ర నేతలంతా బిజీగా ఉండడంతో, బిజెపి నుంచి క్లారిటీ తీసుకుని దానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని  చంద్రబాబు, పవన్ అభిప్రాయపడుతున్నారట.

ఇలా ఎన్నో కారణాలతో రెండు పార్టీల అభ్యర్థుల జాబితా ఆలస్యం అవుతూ వస్తోందట.

Advertisement

తాజా వార్తలు