చిరు టూ లేట్ అంటున్న నెటిజెన్స్.. ఏ విషయంలో అంటే!

టాలీవుడ్ లో నిన్న మా ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి.

ఈ ఎన్నికల కోసం గత నెల రోజులుగా మా సభ్యులు ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ఎన్నికలపై హీట్ పెంచేశారు.

ఎప్పుడు లేనంత హడావిడిగా రసవత్తరంగా ఎన్నికలు జరగడంతో అందరిలో ఒక రకమైన ఉత్కంఠ మొదలయ్యింది.మా అధ్యక్షా పదవికి చాలా మంది పోటీ పడగా చివరికి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మాత్రమే మిగిలారు.

వీరిద్దరి మధ్య రసవత్తరంగా పోరు సాగింది.చివరి వరకు వీరిద్దరిలో ఎవరు గెలుస్తారా అని అందరిలో ఒక ఉత్కంఠ కలిగింది.

నిన్నంతా తెలుగు ప్రజలు టీవీలకు అతుక్కుని మరి ఎవరు గెలుస్తారా అని వేచి చూసారు.అయితే వార్ వన్ సైడ్ అయిపొయింది.

Advertisement

ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందారు.అయితే ఇదే సమయంలో పెళ్లి సందD సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతుంది.

చిరంజీవి కూడా ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.అయితే ఈ వార్త అందుకున్న చిరు ఈ ఈవెంట్ స్టేజ్ మీద ఎన్నికలపై స్పందించారు.

రెండు, మూడేళ్ళ ఉండే పోస్ట్ కోసం ఒకరిపై ఒకరు మాటలు అనుకుంటూ. మా పరువు తీయడం ఎంత వరకు కరెక్ట్.అంటూ చిరు మా సభ్యులను ప్రశ్నించారు.

ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండని.చిన్న చిన్న పదవుల ఇగోలకు పోకుండా వివాదాలు కలిగించే వ్యక్తులను దూరంగా ఇంచాలంటూ కోరారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

అయితే ఈ మాటలన్నీ నిజమే కానీ చిరంజీవి టైమింగ్ నే రాంగ్ అంటున్నారు నెటిజెన్స్.ఎందుకంటే చిరంజీవి ముందే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల కోసం పోటీ పడుతూ ఒకరిపై మరొకరు దూషించుకుంటూ ఉన్నప్పుడు చిరు ఏం చేసారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.ఈ మాటలేవో ఎన్నికల ముందే అందరిని కూర్చో పెట్టి చెప్పి ఉంటే మా పరువు పోయేది కాదంటూ అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు