వాల్తేరు వీరయ్య డెడ్ లైన్‌.. అప్పటి వరకు ముగిసేనా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే విడుదలకు మిగిలి ఉంది.

అంటే షూటింగ్ కి కేవలం 15 రోజుల సమయం మాత్రమే ఉంది.15 రోజుల తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.ఈ సమయం లో వాల్తేరు వీరయ్య షూటింగ్ కార్యక్రమాలు ఇంకా పెండింగ్ ఉందని.

షూటింగ్ కోసం చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.అందుకే చిత్ర యూనిట్ సభ్యులు ఏకంగా మూడు యూనిట్స్ గా విడి పోయి వేరు వేరు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారట.

అందులో చిరంజీవి ఏ యూనిట్ తో కలిసి చిత్రీకరణలో పాల్గొంటున్నాడు అనేది క్లారిటీ లేదు, కానీ షూటింగ్ మరో 10 నుండి 12 రోజుల్లో పూర్తి అయ్యే విధంగా మూడు యూనిట్స్ హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నారు అనే వార్తలొస్తున్నాయి.

Chiranjeevi Waltair Veerayya Movie Shooting Update ,chiranjeevi,waltair Veerayya

అతి త్వరలోనే సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలకు గుమ్మడి కాయ కొట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారట.డిసెంబర్ 30 వరకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేయాలి అంటూ చిరంజీవి డెడ్లైన్ పెట్టాడు అని ఆయన సన్నిహితులు మాట్లాడుకుంటున్నారు.కానీ అప్పటి వరకు సినిమా షూటింగ్ పూర్తి అవుతుందా లేదా అనేది కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Chiranjeevi Waltair Veerayya Movie Shooting Update ,chiranjeevi,waltair Veerayya

యూనిట్ సభ్యులు మూడు ప్రాంతాల్లో చకచక షూటింగ్‌ చేస్తున్నారు.కనుక ఇబ్బంది లేకుండా చిత్రీకరణ పూర్తి అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.కచ్చితంగా సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మెగాస్టార్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిని కూడా కమర్షియల్ గా అలరిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

మెగాస్టార్ చిరంజీవికి జోడి గా ఈ సినిమా లో శృతి హాసన్ నటిస్తుంది.మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు