మెగాస్టార్‌ ఒక్కసారిగా ఇంత సైలెంట్ అయ్యాడేంట్రా బాబు?

మెగాస్టార్ చిరంజీవి ఆ మధ్య ఒకేసారి నాలుగు ఐదు సినిమాలకు కమిట్ అయ్యాడు అంటూ వార్తలు మీడియా లో జోరుగా వచ్చిన విషయం తెలిసిందే.

ఆచార్య సినిమా చేసిన సమయంలోనే వరుసగా సినిమాలకు కమిట్ అయిన మెగాస్టార్ చిరంజీవి అందులో ఒకటి రెండు సినిమాలు కొన్ని కారణాల వల్ల క్యాన్సల్ చేసుకున్నాడు.

గాడ్ ఫాదర్ మరియు భోళా శంకర్ చిత్రాలను చేస్తున్నాడు.గాడ్ ఫాదర్ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భోళా శంకర్ చిత్రం షూటింగ్ దశలో ఉంది.వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కి విడుదలైంది.

ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ఒకే ఒక్క చిత్రం భోళా శంకర్( Bhola Shankar ).ఈ చిత్రం కూడా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

Chiranjeevi Not Commeting New Movies These Days , Bhola Shankar , Venky Kudumula
Advertisement
Chiranjeevi Not Commeting New Movies These Days , Bhola Shankar , Venky Kudumula

అయినా ఇప్పటి వరకు చిరంజీవి( Chiranjeevi ) నుండి తదుపరి సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు.ఆ మధ్య వెంకీ కుడుముల దర్శకత్వం లో చిరంజీవి హీరోగా ఒక సినిమా రాబోతుంది అంటూ ప్రచారం జరిగింది.కానీ ఇప్పటి వరకు ఆ సినిమా ఎలాంటి అప్డేట్ లేదు.

పైగా వెంకీ కుడుముల( Venky Kudumula ) తన తదుపరి సినిమా ను నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు.

Chiranjeevi Not Commeting New Movies These Days , Bhola Shankar , Venky Kudumula

కొత్త దర్శకులతో సినిమాలు చేయాలనుకున్న చిరంజీవి వారి కథలను వింటున్నాడు.కానీ ఓకే చెప్పడం లేదు అనే ప్రచారం జరుగుతుంది.మొత్తానికి చిరంజీవి ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం పట్ల మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి సంవత్సరానికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఇతర సార్ హీరోలు కూడా ఎన్నో ఆదర్శంగా తీసుకొని వరుసగా సినిమాలు చేసే అవకాశం ఉందని అంతా భావించారు.కానీ ఇప్పుడు చిరంజీవి సైలెంట్ అవ్వడం తో మొత్తం ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ గా ఉన్నట్లు అనిపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు