రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు వ్యాఖ్యలు

ఏపీలో రైతుల ఆత్మహత్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరగడం ఆందోళనకరమన్నారు.

మద్ధతు ధర లేకపోవడం, సబ్సిడీలు నిలిచిపోవడమూ ఇందుకు కారణమని ఆరోపించారు.ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా మళ్లీ సమైక్య రాష్ట్రం అంటూ ప్రభుత్వం ప్రకటనలా అని ప్రశ్నించారు.

ఏపీకి రావాల్సిన నిధులపై వైసీపీ ప్రభుత్వం నోరెత్తడం లేదని మండిపడ్డారు.విభజన కంటే జగన్ పాలనతోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు తెలిపారు.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు