ముదుర్లందు రాజకీయ ముదుర్లు వేరయా అన్నట్టుగా ఉంటుంది టిడిపి అధినేత చంద్రబాబుతో రాజకీయం.కిందపడ్డా పైచేయి తనదే అన్నట్లుగా చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి.ఎన్ని ఉపద్రవాలు ముంచుకొచ్చినా, అదరకుండా, బెదరకుండా రాజకీయం నడిపించడంలోనూ, పైచేయి సాధించడంలోనూ టిడిపి అధినేత చంద్రబాబు ఎప్పుడు ముందుంటారు.40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆయన ఈ స్థాయికి వచ్చారు.అందుకే ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకుని, రాజకీయంగా పైచేయి సాధిస్తూ వస్తున్నారు.ప్రస్తుతం ఏపీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
ఏపీ ప్రభుత్వం జడ్జీలు, జర్నలిస్టులు, టిడిపి కీలక నాయకుల ఫోన్ లను టాపింగ్ చేస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటోంది.ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ కి సైతం బాబు లేఖ రాసి ఈ వ్యవహారంపై విచారణ కోరుతూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే.
ఇక్కడే చంద్రబాబు రాజకీయ వ్యూహం బయటపడుతోంది.కేవలం టిడిపి నాయకుల ఫోన్ లను మాత్రమే ఏపీ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ ఆరోపణలు చేస్తే పెద్దగా ఈ అంశంపై చర్చ జరిగేది కాదు.
కానీ జడ్జిలు, పాత్రికేయులు, కొంతమంది ప్రముఖుల పేర్లను కూడా ప్రస్తావించడంతో ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది.
అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదని, ఏపీ ప్రభుత్వం క్లారిటీ గా చెబుతున్నా, చంద్రబాబు ఈ అంశాన్ని హైలెట్ చేసి జాతీయ స్థాయిలో చర్చకు తెర తీశారు.
ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కార్నర్ అయ్యింది.దీనిపై చిత్త శుద్ధిని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి వచ్చింది.గతంలోనూ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని చంద్రబాబు ఇదే రకంగా డైలమాలో పడేసారు.అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిపోయిందని అంతా భావించారు.

చంద్రబాబు సైతం హడావుడిగా ఏపీకి వచ్చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.కానీ ఆ వ్యవహారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది.కారణం అసలు తన ఫోను ఎందుకు ట్యాపింగ్ చేశారంటూ చంద్రబాబు కూడా ఎదురు దాడి చేయడం, ఈ వ్యవహారం పై కేసులు పెట్టడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో వెనక్కి తగ్గింది.అందుకే చంద్రబాబు పై ఎంత రాజకీయ ద్వేషం ఉన్నా, ఈ వ్యవహారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వెళ్ళ లేకపోతోంది.
ఇప్పుడు ఏపీ ప్రభుత్వంను కూడా ఇదే రకంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కార్నర్ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు.