బీజేపీ, జనసేన పొత్తు.. ఖమ్మంలో వేడెక్కిన రాజకీయం..!

తెలంగాణాలో ఈ నెల 30న జరుగనున్న ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది.ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి.

 Khammam Corporation Elections Bjp Janasena Contest Together , Bjp, Janasena, Con-TeluguStop.com

బీజేపీతో పొత్తుకి జనసేన అధినేత పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.ఖమ్మం లో బీజేపీ, జనసేన కలిసి రంగంలోకి దిగుతున్నాయి.

అయితే ఎవరెవరు ఎన్ని స్థానాలు.ఎక్కడెక్కడ పోటీ చేస్తారన్నది చర్చించుకుంటున్నారు.

జనసేన పార్టీ తెలంగాణా ఇంచార్జ్ శంకర్ గౌడ్, రామ్ తాళ్లూరి, పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి వి.వి.రామారావు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

తిరుపతి ఎంపీ స్థానానికి కూడా కలిసి పోటీ చేశాయి బీజేపీ, జనసేన.

ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ లో టీ.ఆర్.ఎస్ అన్ని స్థానాలకు గట్టి పోటీ ఇవ్వాలని చూస్తుంది.టార్గెట్ 60 కి 60 పెట్టుకున్న టీ.ఆర్.ఎస్ ఖమ్మం ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.అయితే ఓ పక్క బీ.జే.పీ, జనసేన కలిసి పోటీ చేస్తుండగా సి.పి.ఎం ఒంటరిగానే బరిలో దిగుతుందని తెలుస్తుంది.టీ.ఆర్.ఎస్ పార్టీ మాత్రం అభ్యర్ధుల నామినేషన్స్ తో హడావిడి మొదలు పెట్టింది. అయితే బీజేపీతో జనసేన కలిసి రావడం టీ.ఆర్.ఎస్ కు షాక్ ఇచ్చింది.పవన్ ఫాలోవర్స్ సపోర్ట్ తో బీజేపీకి ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ కు గట్టి సపోర్ట్ దొరికినట్టే అని చెప్పొచ్చు.

 ఓ పక్క కాంగ్రెస్ కూడా ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ మీద గురి పెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube