కరెన్సీ కట్టలకు ఓట్లు రాలవు బాబు..: విజయసాయి రెడ్డి

టీడీపీ ఎన్ఆర్ఐలపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబు( Chandrababu ) కూటమికి ఘోర పరాజయం తప్పదని ఆయన అను‘కుల’ ఎన్ఆర్ఐ బృందానికి అర్థమైందని విమర్శించారు.

అందుకే డబ్బు మదంతో వాళ్ల కళ్లకు పొరలు కమ్మాయని విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.ఈ క్రమంలోనే కోమటి జయరామ్ చౌదరి( Komati Jayaram Chowdary ) అనే ప్రవాసుడు వైసీపీ సానుభూతిపరులపై నోరు పారేసుకున్నారని మండిపడ్డారు.ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు పారేసి వారిని టీడీపీ వైపు( TDP ) లాగాలని తన వర్గానికి పిలుపునిచ్చారని ఆరోపించారు.దీన్ని బట్టి ఎంత డబ్బు సిద్ధం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.

Chandra Babu Wont Get Votes For Currency Bonds Vijayasai Reddy Details, Ycp, Vij

కరెన్సీ కట్టలకు ఓట్లు రాలవు బాబు అన్న విజయసాయి రెడ్డి 1980- 90 కాలం నాటి మైండ్ సెట్ నుంచి బయటపడాలని సూచించారు.

విమానానికి కుందేలు దెబ్బ.. గాల్లోనే ఇంజన్‌లో భారీ మంటలు.. చివరకు?
Advertisement

తాజా వార్తలు