చంద్రబాబుకి కేంద్రం భారీ షాక్..

ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు ముందు ఉన్న అతిపెద్ద సవాల్.కాపులకి రిజర్వేషన్లు అంశం.

విడవమంటే పాముకు కోపం వద్దంటే కప్పకు కోపం అన్నట్టుగా ఒక పక్క కాపులు రిజర్వేషన్లు కలిపించాలని మరోపక్క బీసీ లు కాపులని బీసీలలో చేర్చితే ఊరుకునేది లేదు ఉద్యమం చేస్తాం అని.చంద్రబాబు కాపులకి రిజర్వేషన్లు కల్పిస్తాను అని ఒక మాట అనేశాడు అంతే అప్పుడు ఇచ్చిన హామీ ఇప్పుడు చంద్రబాబుకి శాపంగా మారింది.ఇప్పటికే పుండు మీద కారంలా ముద్రగడ చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఉన్న తలనెప్పులు చాలవా అన్నట్టుగా ముద్రగడ కొత్త అల్టిమేటం జారీ చేశారు.ముద్రగడ తాజాగా కాపుల రిజర్వేషన్ల కోసం పెట్టిన కండిషన్ లో ఒక మెలిక పెట్టారు.

అసలు ఇచ్చిన మాట గురించే చంద్రబాబునాయుడు కిందా మీదా పది కొట్టిమిట్టాడుతుంటే ఈ కాపుల రిజర్వేషన్లలో కొత్త క్లాజులు తెరమీదకి తెస్తున్నారు.అదేమిటంటే బీసీల్లో ఉన్న కేటగిరీల్లో భాగంగా కాకుండా.

Advertisement

తమకు ప్రత్యేకంగా ఒక కేటగిరీ క్రియేట్ చేసి ఇవ్వాలని ఆయన అంటున్నారు.ఇప్పటికే కాపుల రిజర్వేషన్ వ్యవహారం చంద్రబాబుకి అగ్ని పరీక్షలా ఉంది .డిసెంబరు 6వ తేదీలోగా.రిజర్వేషన్ అనుకూల ప్రకటన రావాలని అల్టిమేటం ఇచ్చిన నేపధ్యంలో ఒక వేళ.అప్పటికీ రాకపోతే.కాపుల ఉద్యమాలు తీవ్రరూపం దాలుస్తాయనే హెచ్చరిక జారీ చేశారు.

కానీ రిజర్వేషన్లు తేలే అవకాశం కనిపించడం లేదు.చంద్రబాబు కక్కలేక మింగలేక నానా అవస్తా పడుతూ ఎలా ఈ గండం నుంచీ గట్టేకాలని చూస్తుంటే ముద్రగడ పెడుతున్న ఇంకో ఫిట్టింగ్ బాబుకి హై బీపీ తెప్పిస్తోంది.

బీసీలకు ప్రస్తుతం ఉన్న ఏబీసీడీల కేటగిరీల్లో తమకు కల్పించే రిజర్వేషన్లు కలపవద్దని ఆయన అంటున్నారు.దీనివలన బీసీ కులాల వారు తమ మీద కక్ష పెంచుకుని కొట్లాడుకునే పరిస్థితి వస్తుందని ఈ దుస్థితి తలెత్తకుండా ఉండాలంటే.

ఆ కేటగిరీల్లో ఎక్కడో ఒకచోట తమను కలపకుండా.తమకు ప్రత్యేకంగా ఒక కేటగిరీ సృష్టించి ఇవ్వాలని ముద్రగడ కోరుతున్నారు.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఏపీలో కూటమి గెలుస్తుంది అంటూ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

డిమాండ్ల మీద డిమాండ్లు పెడుతుంటే ఒకవైపు కేంద్ర మంత్రి చేసిన ప్రకటన మరితం షాక్ ఇస్తోంది.గుజరాత్ ఎన్నికలను ఉద్దేశించి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, ‘రిజర్వేషన్లు 50 శాతానికి మించి పెంచటం కుదరదు’ అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

Advertisement

‘ఒకవేళ రిజర్వేషన్ల శాతం పెంచాలంటే పార్లమెంట్ ద్వారా చట్టాన్ని మార్చాల్సిందే’ అని కూడా స్పష్టం చేశారు.‘ఒకవేళ ఎవరైనా చట్టాన్ని మార్చకుండా రిజర్వేషన్లు ఇచ్చినా కోర్టు సమీక్షలో నిలబడద’ని కూడా చెప్పారు.

కేంద్రం ఇచ్చిన ఈ షాక్ తో చంద్రబాబుకి ఏసీ రూములో కూడా చెమటలు పడుతున్నాయట.ముద్రగడ ఈ విషయంలో మాత్రం వెనక్కితగ్గే ప్రసక్తి లేదని తెగేసి చెప్తున్నారు.

మరి చంద్రబాబు ఈ డీల్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో వేచి చూడాలి మరి.

తాజా వార్తలు