జామకాయ గురించి ఎవరికీ తెలియని ఈ రహస్యం తెలిస్తే అసలు వదలరు

జామకాయను కొంతమంది ఇష్టంగా తింటారు.మరి కొంతమంది జామకాయను తినటానికి ఇష్టపడరు.

 Health Benefits Of Guava-TeluguStop.com

అయితే జామకాయలో ఉండే పోషకాల గురించి చాలా మందికి తెలియదు.జామకాయలో ఉన్న పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే వద్దని అన్నా ప్రతి ఒక్కరు తింటారు.

జామకాయలో మన శరీరానికి అవసరమైన విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

అలాగే వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.అంతేకాక శరీర కణాలు దెబ్బతినకుండా ఉండటంలో విటమిన్ సి కీలకమైన పాత్రను పోషిస్తుంది

జామకాయ మధుమేహ రోగులకు మంచి ఆహారం అని చెప్పవచ్చు.

ఎందుకంటే జామకాయలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.ఈ ఫైబర్ రక్తంలో చక్కర శాతాన్ని క్రమబద్దీకరణ చేస్తుంది.

అలాగే ఈ ఫైబర్ జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది

బరువు తగ్గాలని అనుకొనే వారికీ మంచి ఔషధం.జామకాయను తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

అందువల్ల ఎక్కువ ఆహారం తీసుకోలేరు.దీనిలో ఎక్కువగా పోషకాలు ఉండుట వలన నీరసం కూడా రాదు.

జామకాయలో ఉండే పెక్టిన్ కొలస్ట్రాల్ ని తగ్గించటంలో సహాయపడుతుంది

ప్రతి రోజు ఒక జామపండు తింటే కడుపు ఉబ్బరం, కడుపులో మంట నుండి ఉపశమనం పొంది ఎసిడిటి సమస్య నుండి బయట పడవచ్చు

జామకాయలో మాంగనీస్ సమృద్ధిగా ఉండుట వలన ఎముకలు దృడంగా మారటమే కాకుండా కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి

జామకాయలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉండుట వలన కంటి ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది

జామకాయను బాగా నమిలి తినడం వల్ల శరీరంలో ఫిల్లెట్ బాగా ఉత్పత్తి అవుతుంది.ఈ పోషకాంశాలు గల ఫిల్లెట్ సంతానోత్పత్తిని పెంచే హార్మోలను ఉత్పత్తి చేస్తుంది

జామకాయలో ఐయోడిన్ లేదు.

అయితే ఇందులో ఉండే కాపర్, మరియు ఇతర మినిరల్స్ థైరాయిడ్ జీవక్రియలు క్రమబద్దం చేయడానికి, హార్మోనుల ఉత్పత్తికి ప్రధాన పాత్ర పోషిస్తుంది

కాలిన గాయాలకు జామకాయ గుజ్జును రాస్తే త్వరగా మానుతాయి.ఇందులోని కెరొటినాయిడ్స్‌, ఐసోఫావో నాయిడ్స్‌, పాలి ఫినాల్స్‌ మొదడు కణాలు చురుకుగా పనిచేయడానికి తోడ్పడతాయి

బాగా మిగలపండిన జామపండ్లకు కొద్దిగా మిరియాల పొడిని చేర్చి, నిమ్మ రసం చిలకరించుకొని తింటే మలబద్ధకం దూరమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube