క‌రోనా నుంచి కోలుకున్నా అవి చేయాల్సిందే.. జాగ్ర‌త్త‌!

ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల ప్ర‌జ‌ల‌పై న‌లువైపుల నుంచి దాడి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

గ‌త ఏడాది చైనాలో ప్రాణంపోసుకున్న క‌రోనా వైర‌స్ ఇప్ప‌టికే వికృత రూపం దాల్చి.

ల‌క్ష‌ల మంది ప్రాణాలు బ‌లితీసుకుంది.కంటికి క‌నిపించని ఈ క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌ను కోలుకోలేని దెబ్బ కొట్టింది.

ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎన్నో కుటుంబాలు చిన్నా భిన్నం అయ్యాయి.ఎన్నో కుటుంబాల్లో క‌న్నీళ్లు మిగిల్చిన ఈ క‌రోనా.

ఎప్పుడు అంతం అవుతుందో కూడా ఊహించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.

Advertisement
Central Govt Suggestions For Corona Recovered Patients! Central Government, Coro

అడ్డు అదుపులేకుండా వైర‌స్ విజృంభిస్తోంది.ఇదిలా ఉంటే.

క‌రోనా బాధితుల విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని సూచ‌న‌లు చేసింది.క‌రోనా నుంచి కోలుకున్న‌ప్ప‌టికీ కొన్ని ల‌క్ష‌ణాలు ఉంటాయ‌ని.

వాటి గురించి పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

Central Govt Suggestions For Corona Recovered Patients Central Government, Coro

అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకోవ‌డానికి కాస్త ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలిపారు.ఇక క‌రోనా నుంచి కోలుకున్న‌ప్ప‌టికీ.వ్యాయామం చేయాలని, పోష‌కాహారం తీసుకోవాల‌ని చెప్పారు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)

అలాగే క‌రోనా నుంచి కోలుకున్న‌వారు గుండె పని తీరుతో పాటు రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని పరీక్షించుకోవాలని కేంద్రం స్ప‌ష్టం చేశారు.అదేవిధంగా, రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారం ఖ‌చ్చితంగా తీసుకోవాల‌ని సూచ‌న‌లు చేసింది.

Advertisement

వీటితో పాటు క‌రోనా నుంచి కోలుకున్నా స‌రే మాస్కులు ధ‌రించ‌డం, సోష‌ల్ డిస్టెంట్స్ పాటించ‌డం ఇలా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని తెలిపారు.కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఏకంగా 2కోట్ల 89లక్షలు దాటేసింది.ఇక క‌రోనా మ‌ర‌ణాల విష‌యానికి వ‌స్తే.9లక్షల 24వేలు మించిపోయాయి.అయితే రికవరీ అయిన వారి సంఖ్య సైతం భారీగానే పెరుగుతుండడం విశేషం.

తాజా వార్తలు