సుప్రీం సంచలన తీర్పు రైల్వే పట్టాల వద్ద ఉండేవారికి షాక్!

తాజాగా సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

రైల్వే పట్టాల పక్కన నివాసముంటున్న సుమారు 48 వేల మురికి వాడలను మూడు నెలలో తొలగించాల్సిందిగా ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ ప్రక్రియ చేస్తున్న సమయంలో ఎటువంటి రాజకీయ ఇంటర్ ఫియరెన్స్ ఉండకూడదని ఈ ప్రక్రియపై ఏ న్యాయస్థానం కూడా స్టే ఇవ్వకూడదని తేల్చి చెప్పింది.ఢిల్లీ రైల్ వే ట్రాక్స్ ను అనుకోని సుమారు 140కిమిల దూరంలో ఉన్న 48 వేల మురికి వాడలను తొలగించాలని అంతేకాకుండా ట్రాక్స్ పరిసరాలలో ఉన్న చెత్తను సాలిడ్ మేనేజ్మెంట్ ప్రక్రియ ద్వారా అక్కడి నుండి తొలగించి రైల్ వే ఆస్తులను శుభ్రంగా ఉంచాలని ఉన్నత ధర్మాసనం తీర్పునిచ్చింది.

రైల్వేస్ ను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.అందులో భాగంగా ఇప్పటికే దేశంలో ఉన్న ఎన్నో రైల్వే స్టేషన్స్ ను ఎయిర్ పోర్ట్ లను తలపించేలా ఆధునీకరణ చేస్తుంది.

ఈ ప్రొసెస్ ఒకసారి కంప్లీట్ అయితే మనం సరికొత్త రైల్వే స్టేషన్స్ ను చూసే అవకాశం ఉంటుంది.సరిగ్గా ఈ ప్రక్రియను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం శుభసూచికమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

తాజా వార్తలు