తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ జాప్యంపై కేంద్రం వివరణ

తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్ -1 జాప్యంపై కేంద్రం వివరణ ఇచ్చింది.

పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బీఆర్ఎస్ ఎంపీల ప్రశ్నకు కేంద్రమంత్రి ఆర్కేసింగ్ సమాధానమిచ్చారు.

సల్ఫర్, నైట్రోజన్ విషయంలో కొత్త పర్యావరణ నిబంధనల మేరకు బాయిలర్ ను రీ-ఇంజనీరింగ్ చేసే పనుల్లో జాప్యం నెలకొందని చెప్పారు.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షలు, లాక్ డౌన్ ప్రభావంతో పాటు ఎన్జీటీ విధించిన షరతుల కారణంగా ఆలస్యమైందని తెలిపారు.

యూనిట్ -1ను 2022-23 చివరి త్రైమాసికంలో ప్రారంభించే అవకాశం ఉంది.ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు రూ.10,997.70 కోట్లు ఖర్చైందని ఆర్కేసింగ్ వెల్లడించారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు