Celina Jaitly : పాపం మంచు విష్ణు హీరోయిన్ ఆ లోపంతో బాధ పడుతోందా.. అందుకే ప్రతిసారి కవలలు?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ సెలీనా జైట్లీ( Celina Jaitly ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమె మంచు విష్ణు హీరోగా నటించిన సూర్యం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.

తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా పలుసునిమాలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.ఇక ఆ తర్వాత ఈమె 2011లో సెలీనా జైట్లీ పీటర్ హాగ్ అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకొని ఫారెన్ లో సెటిల్ అయిపోయింది.

ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సెలీనా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటోంది.ఇటీవల సెలీనా ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో చాట్ సెషన్ ను నిర్వహించించింది.

ఈ నేపథ్యంలోనే ఒక అభిమాని ఆసక్తికర ప్రశ్న అడిగాడు.దీనికి సమాధానం ఇస్తూ సెలీనా తన శరీరంలో ఉన్న అరుదైన లోపం గురించి బయట పెట్టింది.అయితే ఆమెలో ఉన్న లోపం గురించి తెలుసుకున్న నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

Advertisement

అదేంటంటే.సెలీనా పీటర్ దంపతులకు 2011లో పెళ్లికాక 2012లో కవల పిల్లలు జన్మించారు.2017లో మరోసారి సెలీనా గర్భవతి అయింది.అప్పుడు కూడా ఆమెకి కవల పిల్లలే( Celina jaitly Birth to Twins ) జన్మించారు.

ఇలా రెండు సార్లు కవలపిల్లలు జన్మించడం చాలా అరుదు.దాంతో ఒక నెటిజన్ మీకు సహజంగానే కవలపిల్లలు పుట్టారా లేక ఏదైనా చికిత్స చేయించుకోవడం వల్ల ఇలా జరిగిందా అని ప్రశ్నించాడు.

దీనికి సెలీనా బదులిస్తూ.తన లోపం గురించి పూర్తిగా వివరించింది.

నాకు రేర్ జెనిటిక్ అనే డిజార్డర్ ఉంది.నాకున్న జన్యు సమస్య వల్ల ఓవిలేషన్ సమయంలో మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్( Multiple Eggs Release ) అవుతాయి.అందువల్లే నేను గర్భవతిని అయిన ప్రతి సారి నాకు కవలలే( Twins ) జన్మిస్తారు అని తెలిపింది.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

నా కేస్ లో నాకు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ జన్మిస్తారు అని సెలీనా తన జన్యు లోపం గురించి వివరించి ఆశ్చర్యపరిచింది.దీనితో నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

ఇది లోపం కాదు దేవుడు మీకిచ్చిన గొప్ప వరం అని అంటున్నారు.తన పిల్లల విషయంలో సెలీనా, పీటర్ దంపతులు( Celina Peter Couple ) గుండె కోత కూడా అనుభవించారు.

రెండవసారి జన్మించిన కవలలు హార్ట్ సంబంధిత సమస్యలతో పుట్టారు.వీరిలో ఒక పిల్లాడు కొన్ని రోజులకే మరణించాడు.

రెండవ పిల్లాడు కోలుకుని ఆరోగ్యంగా పెరుగుతున్నాడు.ప్రస్తుతం సెలీనా తన ముగ్గురు పిల్లలు, భర్తతో సంతోషంగా ఉంది.

ఆమె ఫ్యామిలీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు