పర్మినెంట్ అకౌంట్ నంబర్ (ప్యాన్) చాలా ముఖ్యమైంది.ట్యాక్స్‌కు సంబంధించిన చెల్లింపుల్లో ఇది అవసరం.
కానీ, ఈ ప్యాన్ కార్డును పోగొట్టుకునే అవకాశం ఉంటుంది.కానీ, ఈ ప్యాన్ కార్డును ఆన్‌లైన్‌లో పొందడం ద్వారా ప్యాన్ ఎప్పటికీ మనకు అందుబాటులో ఉంటుంది.
ఆ వివరాలు తెలుసుకుందాం.
ఈ–ప్యాన్‌కు దరఖాస్తు చేసుకునే వారు https://www.incometax.gov.in/iec/foportal/ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆధార్ కార్డు ఉన్నవారికి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉన్నవారికి కేవలం పది నిమిషాల్లో ఈ పాన్‌ను పొందవచ్చు.అంటే
ఆధార్ కార్డు
ఉన్నవారికి మాత్రమే ఈ–ప్యాన్ పొందే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే ప్యాన్‌కార్డుపై డిజిటల్ సిగ్నేచర్‌తోపాటు కేవైసీ వివరాలు ఉంటాయి.ఈ ప్యాన్ కార్డు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంటుంది.
దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది.సంబంధిత వెబ్‌సైట్ హోం పేజీలో ఈ–ప్యాన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

– ఆ తర్వాత కొత్త విండో ఓపెన్ అవుతుంది.అందులోగెట్ న్యూ ఈ–ప్యాన్‌పై క్లిక్ చేయాలి.– అప్పుడు ఆధార్ కార్డు నంబర్ నమోదు చేయాలి.రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్, పుట్టిన సంవత్సరం ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది.– ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.

ఈ–ప్యాన్ చెక్ చేసుకునే విధానం
ఈ ప్యాన్ హోం పేజీలో చెక్ స్టేటస్/ డౌన్‌లోడ్ ప్యాన్’ఆప్షన్ ఉంటుంది.దాన్ని సెలెక్ట్ చేసుకుని వివరాలు నమోదు చేయాలి.అప్పుడు ఈ ప్యాన్ స్టేటస్ తెలిసిపోతుంది.